Hardik Pandya: ఏడు మ్యాచ్‌లకే ఇంత బలుపా.. ఈ ఎక్సట్రాలే తగ్గించుకుంటే మంచిది!

హైదరాబాద్: టీమిండియా టీ20 కెప్టెన్‌గా అనధికారికంగా బాధ్యతలు తీసుకున్న హార్దిక్ పాండ్యాపై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. టీ20 ప్రపంచకప్ 2024 లక్ష్యంగా టీమ్‌ను సిద్దం చేయడంపై బీసీసీఐ ఫోకస్ పెట్టంది. ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లందర్నీ టీ20లకు దూరంగా ఉంచాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యాను టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేసి యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షిస్తోంది. టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా పేరును అధికారికంగా ప్రకటించకపోయినా.. అతన్నే కొనసాగించనుంది. ఇప్పటి వరకు ఏడు టీ20 మ్యాచులకు కెప్టెన్‌గా నేతృత్వం వహించిన పాండ్యా.. ఐదు విజయాలు అందించాడు. ఒకదాంట్లో ఓడిన భారత్.. మరో మ్యాచ్‌ను టై చేసుకుంది.

ఏడు మ్యాచులకే..
అయితే ఏడు మ్యాచులకే హార్దిక్ పాండ్యా ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కెప్టెన్ అయిన తర్వాత హార్దిక్ అటిట్యూడ్ మారిందని.. ఏడు మ్యాచ్‌లకే ఇంత బిల్డప్ ఇస్తే.. భవిష్యత్తులో ఇంకా ఎలా ఉంటాడోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం శ్రీలంకతో పుణే వేదికగా జరిగిన రెండో టీ20లో టాస్ గెలిచిన హార్దిక్ బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. గత రికార్డ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్‌కు ఫేవర్‌గా ఉన్నా.. పట్టించుకోలేదు. ఇది టీమిండియా ఓటమిని శాసించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకు తీసుకోలేదని కామెంటేటర్ మురళీ కార్తీక్ అడిగితే.. చాలా వెటకారంగా 'అవునా.. నాకు ఆ విషయం తెలియదు'అంటూ సమాధానం ఇచ్చాడు.

కెప్టెన్‌గా అత్యుత్సాహం
అంతేకాకుండా మైదానంలో ఆటగాళ్లు చేసిన తప్పిదాలకు చిర్రుబర్రులాడుతున్నాడు. ఉమ్రాన్ మాలిక్ నోబాల్ వేసినప్పుడు.. ఇతర బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ మిస్ చేసినప్పుడు నోరు పారేసుకున్నాడు. కీలక సమయంలో బౌలింగ్ చేయకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. బౌలింగ్ మార్పులు కూడా జట్టుకు నష్టం చేసేలా ఉన్నాయి. ఈ అటిట్యూడ్ కారణంగానే ముంబై ఇండియన్స్ అతన్ని వదిలేసిందని, ఈ తరహా ప్రవర్తన అతనితో పాటు జట్టుకు మంచిది కాదని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

సీనియర్లు అనే గౌరవం లేకుండా..
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా కూడా హార్దిక్ ఇలానే ప్రవర్తించాడని, మైదానంలో షమీ లాంటి సీనియర్ ఆటగాళ్లనే గౌరవం లేకుండా నోరు పారేసుకున్నాడని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు హార్దిక్ పాండ్యాను టీ20లకు పూర్తి స్థాయి కెప్టెన్‌ను చేస్తున్నట్లు ప్రచారం జరిగినా.. బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్‌లోనూ ఈ ప్రస్తావన తీసుకురాలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications