న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: గుజరాత్ రాజకీయాలకు రుతురాజ్ బలి! హార్దిక్‌ పాండ్యాపై ఫ్యాన్స్ ఫైర్!

IND vs SL: Fans Slams Rahul Dravid After Ruturaj Gaikwad Not Playing 3rd T20I against Sri Lanka

హైదరాబాద్: టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. శ్రీలంకతో తొలి రెండు టీ20ల్లో అవకాశం అందుకోని రుతురాజ్‌కు చివరి మ్యాచ్‌లో అవకాశం దక్కుతుందని భావించినా టీమ్‌మేనేజ్‌మెంట్ మొండిచెయ్యే చూపించింది. వరుసగా విఫలమైన శుభ్‌మన్ గిల్‌కు మరో అవకాశం ఇచ్చిన టీమ్‌మేనేజ్‌మెంట్ ఆశ్చర్యకరంగా ఎలాంటి మార్పులు చేయకుండా మూడో టీ20 బరిలోకి దిగింది. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చి రెండో టీ20 ఆడిన టీమిండియా.. ఓటమి ఎదురైనా ఎలాంటి మార్పులు చేయకుండా ఆఖరి మ్యాచ్ ఆడుతోంది. ఐదు నోబాల్స్‌తో అర్ష్‌దీప్ సింగ్ చెత్త ప్రదర్శన కనబర్చినా.. అతనికి అండగా నిలిచింది.

శుభ్‌మన్ విఫలమైనా..

ఈ సిరీస్‌తోనే టీ20ల్లోకి అరంగేట్రం చేసిన శుభ్‌మన్ గిల్ వరుసగా రెండు టీ20ల్లో 7, 5 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో మూడో టీ20ల్లో అతన్ని పక్కనపెట్టి రుతురాజ్‌కు అవకాశం ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ హార్దిక్ పాండ్యా, రాహుల్ ద్రవిడ్‌లతో కూడిన టీమ్‌మేనేజ్‌మెంట్ శుభ్‌మన్‌గిల్‌కు అండగా నిలిచింది. అయితే ఈ నిర్ణయం అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపిన రుతురాజ్ గైక్వాడ్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టి.. ఆచితూచి ఆడే శుభ్‌మన్ గిల్‌ను ఆడిస్తోందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు శుభ్‌మన్ గిల్ టీ20 ఫార్మాట్‌కు సెట్ అవ్వడని, అలాంటి ప్లేయర్‌కు అవకాశం ఇవ్వడం విచిత్రంగా ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు కేఎల్ రాహుల్ తన జిడ్డు బ్యాటింగ్‌తో సతాయిస్తే.. ఇప్పుడు శుభ్‌మన్ మోపయ్యాడని మండిపడుతున్నారు.

గుజరాత్ ప్లేయర్ కావడంతోనే..

గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ అనే ఒకే ఒక్క కారణంతో శుభ్‌మన్ గిల్‌కు తుది జట్టులోకి తీసుకున్నారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. వరుసగా విఫలమవుతున్నా అవకాశాలు ఇచ్చేది కూడా అందుకేనని.. పైకి మాత్రం యువ ఆటగాళ్లు నేర్చుకునే దశలో ఉన్నారని, కాస్త సమయం ఇవ్వాలనే మాటలు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. ఈ పద్దతి అందరికి వర్తింపు జేయాలని, ఉద్దేశపూర్వకంగా కొందరి ఆటగాళ్లకు మాత్రమే అండగా నిలవడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. భారత జట్టులో గత కొద్ది రోజులుగా గుజరాత్ ఆటగాళ్లకు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ రాజకీయాలకు రుతురాజ్ బలయ్యాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

6 బంతుల్లో 6 సిక్స్‌లు..

రుతురాజ్ గైక్వాడ్.. విజయ్ హజారే ట్రోఫీలో 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టాడనే విషయం టీమ్‌మేనేజ్‌మెంట్ మర్చిపోయినట్లుందని మండిపడుతున్నారు. ధాటిగా ఆడగలిగే రుతురాజ్ గైక్వాడ్‌కు అండగా నిలిచి వరుస అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఐపీఎల్ వంటి వరల్డ్ బెస్ట్ లీగ్‌ల్లో రుతురాజ్ ఆరెంజ్ క్యాప్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌కు టైటిల్ అందించాడనే విషయాన్ని కూడా మరిచిపోయారని, అసలు రుతురాజ్ కంటే శుభ్‌మన్ గిల్ ఏ విషయం గొప్ప అని ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ కాకుంటే అసలు శుభ్‌మన్ జట్టులోకి కూడా వచ్చే వాడు కూడా కాదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Saturday, January 7, 2023, 19:47 [IST]
Other articles published on Jan 7, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X