శుభ్‌మన్, శివమ్ అరంగేట్రం..
వాంఖడే వేదికగా జరుగుతున్న తొలి టీ20లో రాహుల్ త్రిపాఠి లేకుండానే బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ ద్వారా శుభ్‌మన్ గిల్, శివమ్ మావి అరంగేట్రం చేయగా.. రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠిలు బెంచ్‌కే పరిమితమయ్యారు. ఇషాన్ కిషన్‌తో కలిసి గైక్వాడ్ ఆడుతాడని అంతా భావించగా.. టీమ్‌మేనేజ్‌మెంట్ మాత్రం శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇచ్చింది. అర్ష్‌దీప్ సింగ్ ఫిట్‌గా లేకపోవడంతో శివమ్ మావి అవకాశం అందుకున్నాడు. అయితే రాహుల్ త్రిపాఠికి అవకాశం ఇవ్వకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ సిరీస్‌కు ఎంపిక చేసి బెంచ్‌కు పరిమితం చేయడం సరికాదని మండిపడుతున్నారు.
వాటర్ బాటిల్స్ అందించేందుకే..
రాహుల్ త్రిపాఠికి వచ్చిన కష్టం పగోడికి కూడా రావద్దంటున్నారు. వాటర్ బాటిల్స్ అందించేందుకే రాహుల్ త్రిపాఠిని జట్టులోకి తీసుకుంటున్నారా? అని నిలదీస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో సెంచరీల మోత మోగించిన రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కనపెట్టడం కూడా సరికాదంటున్నారు. గతేడాదే జిడ్డు బ్యాటింగ్‌తో కేఎల్ రాహుల్ జట్టు కొంపముంచాడని, మళ్లీ అతనిలా ఆడే శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. శుభ్‌మన్ గిల్ బదులు ధాటిగా ఆడే రుతురాజ్ గైక్వాడ్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్‌పై సోషల్ మీడియా వేదికగా సానుభూతి వ్యక్తమవుతోంది.
టీమిండియానా? గుజరాత్ జట్టా?
ఇక ఈ మ్యాచ్‌లో పూర్తిగా గుజరాత్ ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశమైంది. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభ్‌మన్ గిల్, శివమ్ మావిలు అరంగేట్రం చేయడం.. గుజరాత్ రాష్టానికి చెందిన దీపక్ హుడాలకు జట్టులో అవకాశం ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్‌లను పక్కనపెట్టి మరీ గుజరాత్ ఆటగాళ్లకు అవకాశాలిచ్చారని ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా గుజరాత్ ఆటగాళ్లకు భారత జట్టులో అనవసర ప్రాధాన్యత లభిస్తుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది.

సంజూ, శుభ్‌మన్ విఫలం..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 46 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే అరంగేట్ర ప్లేయర్ శుభ్‌మన్ గిల్(7) ఎల్బీగా వెనుదిరిగాడు. తీక్షణ బౌలింగ్‌ను అంచనా వేయలేకపోయిన అతను వికెట్లు ముందు దొరికిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(7) బౌండరీతో దూకుడు కనబర్చాడు. కానీ అదే జోరులో కరుణరత్నే బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. రాకరాక వచ్చిన అవకాశాన్ని సంజూ శాంసన్(5) సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అనవసర షాట్‌తో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.


Click it and Unblock the Notifications












