Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: సంక్రాంతి అంటే కోహ్లీకి పండుగే.. ఫ్యాన్స్‌కు పునకాలే! ఒకటా.. రెండా.. 4 సెంచరీలు!

 IND vs SL: Fans Says 15th January as Virat Kohli Day not Sankranti

తిరువనంతపురం: శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 166 నాటౌట్) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. అసాధారణ బ్యాటింగ్‌తో అభిమానులకు సంక్రాంతి సంబరాలను డబుల్ చేశాడు. అయితే విరాట్ కోహ్లీ‌కి సంక్రాంతి పండుగకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ పర్వదినాన్న(జనవరి 15) కోహ్లీ తాజా సెంచరీతో కలిపి ఏకంగా నాలుగు సెంచరీలు బాదాడు.

సంక్రాంతి అంటే పునకాలే..

2017లో సంక్రాంతి రోజే ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో 102 బంతుల్లో 122 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. 2018 సంక్రాంతికి సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్‌లో 217 బంతుల్లో 153 పరుగులు చేశాడు. 2019 సంక్రాంతికి ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్‌లో 112 బంతుల్లో 104 పరుగులు చేశాడు. 2020 నుంచి 2022 ఆసియా కప్ వరకు సెంచరీ చేయని విరాట్ కోహ్లీ.. మళ్లీ 2023 సంక్రాంతికి సెంచరీ బాది అభిమానులకు పునకాలు తెప్పించాడు. ప్రస్తుతం ఈ గణంకాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యర్థి ఎవరైనా.. వేదిక ఏదైనా.. సంక్రాంతి రోజు విరాట్ కోహ్లీ సెంచరీ బాదడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

 వరల్డ్ రికార్డు..

వరల్డ్ రికార్డు..

ఇక ఈ సెంచరీతో కెరీర్‌లో 46వ వన్డే పూర్తి చేసుకున్న కింగ్ కోహ్లీ.. సచిన్ 49 సెంచరీల రికార్డుకు మూడు అడుగుల దూరంలో నిలిచాడు. ఓవరాల్‌గా 74 సెంచరీ నమోదు చేసి సచిన్ 100 సెంచరీల రికార్డు అధిగమించే దిశగా దూసుకెళ్తున్నాడు. 259 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ 46 సెంచరీలు బాదగా.. 452 ఇన్నింగ్స్‌ల్లో సచిన్ 49 శతకాలు నమోదు చేశాడు. శ్రీలంక‌పై 10 వన్డే సెంచరీలు బాది ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు బాదిన ఏకైక ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.

4 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు..

4 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు..

వన్డే క్రికెట్ చరిత్రలోనే నాలుగుసార్లు 150 ప్లస్ పరుగులతో అజేయంగా నిలిచిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ వన్డేల్లో ఐదు సార్లు 150+ స్కోర్లు నమోదు చేశాడు. గత నాలుగు వన్డే ఇన్నింగ్స్‌ల్లో విరాట్ మూడు సెంచరీ‌లు బాదాడు. బంగ్లాదేశ్‌పై 113, శ్రీలంకపై 113, 4, 166 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే(12,650)ను విరాట్ కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ ఇప్పటి వరకు 12754 పరుగులు చేశాడు.

 చెలరేగిన సిరాజ్..

చెలరేగిన సిరాజ్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీకి అండగా శుభ్‌మన్ గిల్(97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116) కూడా శతక్కొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(38) పర్వాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజితా, లాహిరు కుమార రెండేసి వికెట్లు తీయగా.. కరుణరత్నే ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక మహమ్మద్ సిరాజ్(4/20), మహమ్మద్ షమీ ధాటికి 51 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

Story first published: Sunday, January 15, 2023, 19:36 [IST]
Other articles published on Jan 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+