Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదృష్టం తలుపు తడితే దరిద్రం వెనక్కు లాగింది.. సంజూ శాంసన్ గాయంపై పేలుతున్న సెటైర్లు!

IND vs SL: Fans Reaction after Sanju Samson ruled out of Sri Lanka T20Is

హైదరాబాద్: 'అదృష్టం తలుపు తడితే దరిద్రం వెనక్కు లాగింది'అనే సామెత టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు సరిగ్గా సరిపోతుంది. టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్న ఈ కేరళ క్రికెటర్‌కు లక్ మాత్రం కలిసి రావడం లేదు. దేశవాళీ, ఐపీఎల్‌లో తనదైన ఆటతో ప్రత్యేక అభిమానాన్ని అందుకున్న సంజూ శాంసన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం రాణించలేకపోతున్నాడు. ఇన్నాళ్లు అవకాశాలు లేక నిరీక్షించిన సంజూ శాంసన్‌కు శ్రీలంకతో టీ20 సిరీస్‌ రూపంలో రాక రాక వచ్చి ఒక్క అవకాశాన్ని గాయం మింగేసింది. దాంతో మరో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశాన్ని సంజూ శాంసన్ కోల్పోయాడు.

పంత్‌ దూరమవ్వడంతో..

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో జట్టులో వికెట్ కీపర్ స్థానానికి ఖాళీ ఏర్పడింది. పంత్‌కు తీవ్ర గాయాలవ్వడంతో అతను 9 నెలల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శ్రీలంకతో సిరీస్‌లో సత్తా చాటితే సంజూ శాంసన్‌కు అవకాశం దక్కేది. కానీ తొలి టీ20లో చెత్త షాట్‌తో విఫలమైన సంజూ.. ఫీల్డింగ్ చేస్తూ మోకాలి గాయానికి గురయ్యాడు. దాంతో సిరీస్ మొత్తానికి దూరమై.. వికెట్ కీపర్ రేసులో వెనుకంజ పడ్డాడు.

లిప్‌లాక్ ఇచ్చిన బ్యాడ్ లక్..

సంజూ శాంసన్ దురదృష్టంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్, మీమ్స్ షేర్ చేస్తున్నారు. అదృష్టం వచ్చి హగ్ ఇచ్చే లోపు, బ్యాడ్ లక్ వచ్చి లిప్‌లాక్ ఇచ్చిందని జోకులు పేల్చుతున్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సిరీస్‌ల్లో సంజూకు అవకాశం దక్కుతుందో లేదోనని, వస్తే మాత్రం అతను ఈసారి కాకుండా చెలరేగాలని ఆశిస్తున్నారు. సంజూ శాంసన్‌కు ఎంతో ప్రతిభ ఉన్నా.. అదృష్టం కలిసి రావడం లేదని కామెంట్ చేస్తున్నారు. ప్రతిభ ఉంటే సరిపోదు.. అదృష్టం ఉండాలనే మాట సంజూ శాంసన్‌ను చూస్తే అర్థమవుతుందని ట్విటర్ వేదికగా అభిప్రాయపడుతున్నారు.

జట్టులోకి జితేశ్ శర్మ

సంజూ శాంసన్ గాయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తొలి టీ20లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సంజూ మోకాలికి గాయమైనట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో అతనికి వెంటనే స్కాన్స్ తీయించామని, నిపుణులు అతనికి విశ్రాంతి అవసరం అని చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. సంజూ శాంసన్ స్థానంలో విదర్భ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మను ఎంపిక చేసింది. రెండో టీ20లో సంజూ స్థానంలో రాహుల్ త్రిపాఠి తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

Story first published: Thursday, January 5, 2023, 17:19 [IST]
Other articles published on Jan 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+