For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: స్టేడియంలో కొట్టుకున్న భారత్, శ్రీలంక అభిమానులు (వీడియో)

కొలంబో: ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన సూపర్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ విజయంతో భారత్ ఫైనల్ బెర్త్ కూడా ఖరారు చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక గొప్పగా పోరాడింది. ముందుగా బంతితో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూల్చిన శ్రీలంక.. ఆ తర్వాత లక్ష్యచేధనలో బ్యాట్‌తో పోరాడింది. ఓ దశలో విజయం దిశగా దూసుకెళ్లింది. కానీ అనుభవం కలిగిన భారత్ బౌలర్ల ముందు విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే శ్రీలంక అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

మ్యాచ్ అనంతరం విజయాన్ని ఆస్వాదిస్తున్న భారత అభిమానులను చూసి తట్టుకోలేకపోయారు. ఓ శ్రీలంక అభిమాని.. ఇండియన్ ఫ్యాన్‌పై దాడి చేసి పిడి గుద్దులు గుద్దాడు. భారత అభిమాని కూడా ఎదురు దాడికి దిగాడు. అక్కడే ఉన్న పక్కనవారు ఇద్దర్నీ విడదీసారు. మహిళా పోలీస్ సమక్షంలోనే ఈ గొడవ జరగడం విశేషం.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు కుప్పకూలింది. రోహిత్ శర్మ(48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(61 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 33), కేఎల్ రాహుల్(44 బంతుల్లో 2 ఫోర్లతో 39) పర్వాలేదనిపించారు. చివర్లో అక్షర్ పటేల్(26, సిరాజ్(5 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.

లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే(5/40) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. చరిత్ అసలంక (4/14) నాలుగు వికెట్లు తీసాడు. మహీశ్ తీక్షణకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. ధనంజయ డిసిల్వా( 66 బంతుల్లో 5 ఫోర్లతో 41), దునిత్ వెల్లలాగే(46 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/43) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాకు తలో వికెట్ దక్కింది.

IND vs SL: Fans Fight After India’s Win Over Sri Lanka In Asia Cup 2023 Super 4 Match
Story first published: Wednesday, September 13, 2023, 14:25 [IST]
Other articles published on Sep 13, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+