IND vs SL: ధ్రువ్ జురెల్ స్టన్నింగ్ క్యాచ్‌పై దుమారం.. శ్రీలంక కోచ్‌లు ఆగ్రహం! (వీడియో)
భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో అంపైర్ల నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఎల్బీడబ్ల్యూ, క్యాచ్‌ల విషయంలో అంపైర్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంపైర్ల తీరు కారణంగానే తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసిందని మూడో రోజు ఆట అనంతరం భారత స్పిన్నర్ మానవ్ సుతార్ అనడం తీవ్ర వివాదాస్పదమైంది.
నాలుగో రోజు ఆటలో కేఎల్ రాహుల్ ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్ ఘోర తప్పిదం చేయడం.. డీఆర్‌ఎస్ ద్వారా అతను ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడం కూడా చర్చనీయాంశమైంది. ఆఖరి సెషన్‌లో భారత ఫీల్డర్ ధ్రువ్ జురెల్ అందుకున్న లో-క్యాచ్‌పై కూడా దుమారం రేగుతోంది. శ్రీలంక ఓపెనర్ లాహిరు ఉడారా ఇచ్చిన లో- స్లిప్ క్యాచ్‌ను ధ్రువ్ జురెల్ అద్భుతంగా అందుకున్నాడు.

అయితే క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేలకు తాకినట్లుగా రిప్లేలో కనిపించింది. కానీ ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై శ్రీలంక కోచ్‌లు, ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మానవ్ సుతార్ వేసిన 22వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ నాలుగో బంతిని లాహిరు ఉడారా డిఫెన్స్ చేయగా బంతి గల్లీ వైపు లో-క్యాచ్‌గా వచ్చింది. అక్కడే ఉన్న ధ్రువ్ జురెల్ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. రిప్లేలను పరిశీలించిన అంపైర్ బంతి కింద చేతివేళ్లు ఉన్నాయని ఔటిచ్చాడు. అయితే ఈ నిర్ణయంపై లాహిరు ఉడారా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసహనంగా క్రీజును వీడాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్ 462 ఆలౌట్ (దేవదత్ పడిక్కల్ 167, కేఎల్ రాహుల్ 82, ప్రబాత్ జయసూర్య 4/109)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 284 ఆలౌట్( సొనాల్ దినుషా 100, నిరోషణ్ డిక్‌వెల్లా 80)
భారత్ రెండో ఇన్నింగ్స్ 193 ఆలౌట్(రిషభ్ పంత్ 66, దేవదత్ పడిక్కల్ 44)
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 84/4 (ధనంజయ డిసిల్వా 31 బ్యాటింగ్, సోనాల్ దినుషా 25)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
