
కోచ్‌గా ద్రవిడ్
గతేడాది వాయిదా పడిన శ్రీలంక పర్యటనను బీసీసీఐ ఇప్పుడు ప్లాన్ చేసింది. శ్రీలంక పర్యటనలో భారత్ జులై 13 నుంచి 27 వరకూ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఇంగ్లండ్ టూర్‌కి ఎంపికవని భారత క్రికెటర్లతో రెండో జట్టుని బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించనున్నారు. భారత మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)హెడ్ రాహుల్ ద్రవిడ్.. లంకకు వెళ్లే టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించనున్నారు. అయితే బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ లంక పర్యటన ఉంటుందని చెప్పినప్పటినుంచి కెప్టెన్ ఎవరనే విషయం చర్చకు వచ్చింది.

గబ్బర్‌కే ఓటేస్తున్నారు
లంకకు వెళ్లే జట్టుకు కెప్టెన్ రేసులో మొదటగా శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యాలు ఉన్నారు. భుజానికి శస్త్ర చికిత్స చేసుకున్న అయ్యర్ పూర్తిగా కోలుకోని నేపథ్యంలో అతడు లంకకు వెళ్లడం లేదని స్పష్టం అయింది. దీంతో రేసులో మిగిలింది గబ్బర్, హార్దిక్. అభిమానులతో పాటు కొంత మంది ఆటగాళ్లు కెప్టెన్‌గా గబ్బర్‌కే ఓటేస్తున్నారు. అతడే సరైనోడు అని అంటున్నారు. ఈ జాబితాలో టీమిండియా పేసర్ దీపక్ చహర్ కూడా చేరిపోయాడు. జట్టులో ఎక్కువ అనుభవం ఉన్న సీనియర్ క్రికెటర్ ధావన్ అని, అతడినే కెప్టెన్‌గా ఎంపిక చేయడమే సమంజసం అని అంటున్నాడు.
భారత్ అలుపెరుగని పోరాటం చేస్తోంది.. ఇష్టారీతిన ఎవరూ మాట్లాడకండి! ఆసీస్ మాజీ క్రికెటర్ ఫైర్!

శిఖర్ భాయ్ గుడ్ ఛాయిస్
తాజాగా దీపక్ చహర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'కెప్టెన్‌గా శిఖర్ భాయ్ గుడ్ ఛాయిస్. ఎందుకంటే సుదీర్ఘకాలంగా జట్టుకు ఆడుతున్నాడు. అలానే జట్టులో ఎక్కువ అనుభవం ఉన్న సీనియర్ క్రికెటర్ కూడా. నా అభిప్రాయం ప్రకారం ధావన్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేయడమే సమంజసం. సీనియర్ ప్లేయర్ కావడంతో ఆటగాళ్లు కూడా అతడ్ని గౌరవిస్తారు. కెప్టెన్‌ని ఆటగాళ్లు గౌరవించాలి కూడా' అని అన్నాడు. భారత పేస్ విభాగంలో చహర్‌తో పాటు భువనేశ్వర్ కుమార్, నవదీప్ సైనీ కూడా ఉన్నారు.

2018 నిదహాస్ తర్వాత
భారత జట్టు జూలై 5న శ్రీలంకలో అడుగుపెట్టి.. 28న తిరుగు పయనంకానుంది. జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. కఠిన బయో బబుల్ నేపథ్యంలో ఈ సిరీస్‌లు ప్రేక్షకుల్లేకుండానే జరగనున్నాయి.
2018 నిదహాస్ తర్వాత భారత్ తొలిసారి శ్రీలంకలో పర్యటిస్తుండటంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. శిఖర్ ధావన్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, రాహుల్ తెవాటియాలు లంక వెళ్లే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












