IND vs SL:ఓడినా.. సెంచరీతో టీమిండియాను వణికించిన డసన్ షనక!

గువహటి: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో సూపర్ బ్యాటింగ్‌తో 67 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా.. స్లాగ్ ఓవర్లలో భారత బౌలర్ల వైఫల్యం తెలిసొచ్చింది. శ్రీలంక కెప్టెన్ డసన్ షనక(88 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108 నాటౌట్) అద్భుత సెంచరీతో టీమిండియాను వణికించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగులు చేసింది. కోహ్లీ(87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 113) శతక్కొట్టగా.. రోహిత్ శర్మ(67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83), శుభ్‌మన్ గిల్(60 బంతుల్లో 11 ఫోర్లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజితా మూడు వికెట్లు తీయగా.. దిల్షాన్ మదుషంక, చమిక కరుణరత్నే, డసన్ షనక, ధనుంజయ డిసిల్వా తలో వికెట్ తీసారు.

ఉమ్రాన్ చెలరేగినా..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 306 పరుగులు చేసింది. షనకకు తోడుగా పాతుమ్ నిస్సంక(72) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమీ తలో వికెట్ తీసారు.

సిరాజ్ శుభారంభం..
374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మహమ్మద్ సిరాజ్ తన వరుస ఓవర్లలో అవిష్క ఫెర్నాండో(5), కుశాల్ మెండీస్(0)లనుక్లీన్ బౌల్డ్ చేశాడు. ఫెర్నాండోను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన సిరాజ్.. కుశాల్ మెండీస్‌ను ఇన్‌స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో శ్రీలంక 2 వికెట్లకు 38 పరుగులు చేసింది. ఆ తర్వాత అసలంకను ఫాస్టెస్ట్ డెలవరీతో ఉమ్రాన్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. అయితే రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు కనిపించలేదు.

వరుసగా వికెట్లు..
ఆ వెంటనే డిసిల్వా(47)ను మహమ్మద్ షమీ ఔట్ చేయగా.. మరోవైపు ఓపెనర్ పాతుమ్ నిస్సంక హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోయిన నిస్సంకను ఉమ్రాన్ మాలిక్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన హసరంగా సిక్సర్లతో జోరు కనబర్చినా.. చాహల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. దునిత్ వెల్లలగే(0)ను ఉమ్రాన్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే కరుణరత్నేను హార్దిక్ పాండ్యా ఔట్ చేయడంతో 206 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.

సెంచరీతో చెలరేగిన డసన్ షనక..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కసున్ రజితా సాయంతో డసన్ షనక పోరాడాడు. పూర్తిగా స్ట్రైకింగ్ తీసుకుంటూ తనదైన షాట్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతను ఇచ్చిన రెండు సునాయస క్యాచ్‌లను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు నేలపాలు చేశారు. ఈ అవకాశాలతో చెలరేగిన డసన్ షనక.. 9వ వికెట్‌కు అజేయంగా 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ క్రమంలో సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. చివర్లో షమీ మన్కడింగ్‌కు ప్రయత్నించినా.. రోహిత్ శర్మ వద్దని క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications