
చెలరేగిన చాహల్..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుక(36) మంచి శుభారంభాన్ని అందించారు. ఆరంభంలో కొంచెం ఆచితూచి ఆడిన ఈ జోడీ ఆ తర్వాత వరుస బౌండరీలతో విరుచుకుపడింది. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 59 రన్స్ చేసింది. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ ధావన్ తన ట్రంప్ కార్డ్ యుజ్వేంద్ర చాహల్‌ను రంగంలోకి దింపాడు. కట్టుదిట్టమైన బంతులతో ఇబ్బంది పెట్టిన చాహల్.. 14వ ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు తీసి భారత్‌కు మంచి బ్రేక్ త్రూ అందించాడు. తొలుత ఫస్ట్ వన్డే తరహాలోనే మినోద్ బానుక(36)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన చాహల్.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స(0)ను కీపర్ సాయంతో గోల్డెన్ డక్‌గా వెనక్కిపంపాడు.

ఫెర్నాండో ఫిఫ్టీ..
ఆ తర్వాత దూకుడు తగ్గించిన ఫెర్నాండో.. డిసిల్వాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. దాంతో పరుగుల వేగం తగ్గింది. భువీ వేసిన 25వ ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసిన ఫెర్నాండో 70 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన అతను మిడ్ వికెట్‌లో కృనాల్‌కు చిక్కాడు. కొద్ది సేపటికే దీపక్ చాహర్ బౌలింగ్‌లో డిసిల్వా కూడా(32) ఔటయ్యాడు. అతను ధావన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన డసన్ షనక(16), చరిత్ అసలంకతో కలిసి నిదానంగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ చాహల్ అతన్ని క్లీన్ బౌల్డ్ చేసి శ్రీలంకను దెబ్బతీశాడు.

చరిత్ మెరుపు ఇన్నింగ్స్..
ఆ తర్వాత వచ్చిన వానిందు హసరంగా(8)ను దీపక్ చాహర్ క్లీన్ బౌల్డ్ చేయగా.. చరిత్ అసలంకా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కుల్దీప్ వేసిన 45వ ఓవర్ ఫస్ట్ బాల్‌ను ఎక్స్‌ట్రా కవర్స్ మీదుగా బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించాడు. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. ఇక ధాటిగా ఆడే క్రమంలో చరిత్ అసలంకా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. చివర్లో దుష్మంత్ చమీరా, లక్షణ్ సందకన్ ఔటైనా.. చమిక కరుణరత్నే(44) ధాటిగా ఆడి శ్రీలంకకు భారీ స్కోర్ అందించాడు.


Click it and Unblock the Notifications
