For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: అర్ష్‌దీప్ సింగ్ చెత్త రికార్డు.. అది లేకపోవడంతోనే..!

IND vs SL: Arshdeep Singh creates unwanted record, becomes first India bowler to bowl hat-trick of no-balls in T20Is

పుణే: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. శ్రీలంకతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఐదు నోబాల్స్‌తో భారత్ ఓటమికి కారణమైన అర్ష్‌దీప్ సింగ్.. హ్యాట్రిక్ నోబాల్స్‌తో అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లను మాత్రమే వేసిన అర్ష్‌దీప్ సింగ్ తొలి ఓవర్‌లో వరుసగా మూడు నోబాల్స్ వేయగా.. శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్‌ చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో అర్షదీప్ ఏకంగా 19 పరుగులు ఇవ్వడంతో కెప్టెన్ హార్దిక్ మళ్లీ అతడి చేతికి బంతిని ఇవ్వడానికే భయపడ్డాడు.

తొలి బౌలర్‌గా..

తిరిగి 19వ ఓవర్ వేసే బాధ్యతను అర్షదీప్‌కు అప్పగించగా.. అప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. ఆ ఓవర్లోనూ భారత పేసర్ వరుసగా రెండు నోబాల్స్ వేశాడు. దాంతో 12 బంతుల వ్యవధిలో 5 నోబాల్స్ వేసిన తొలి భారత పేసర్‌గా నిలిచిన అర్ష్‌దీప్ సింగ్.. హ్యాట్రిక్ నోబాల్స్ వేసిన బౌలర్‌గా కూడా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. అనారోగ్యం కారణంగా తొలి టీ20 ఆడని అర్షదీప్.. ఈ మ్యాచ్‌లో హర్షల్ పటేల్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. కానీ అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. ఈ కారణంతోనే అర్షదీప్ నోబాల్స్ వేశాడని భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ ట్వీట్ చేశాడు.

మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడంతోనే..

మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడంతోనే..

లంకపై 5 నోబాల్స్ వేసిన అర్షదీప్ ఒక టీ20 మ్యాచ్‌లో అత్యధిక నోబాల్స్ వేసిన భారత బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇంతకు ముందు అతను సౌతాఫ్రికాపై 4 నోబాల్స్ వేయడమే ఇప్పటి వరకూ అత్యధికం కాగా.. అర్షదీప్ తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ సైతం తలో నోబాల్ వేశారు. దాంతో భారత బౌలర్లు 7 నోబాల్స్ వేసి శ్రీలంకకు అదనంగా 36 పరుగులిచ్చారు. అంతర్జాతీయ టీ20ల్లో ఓ ఫుల్ మెంబర్ టీమ్ వేసిన అత్యధిక నోబాల్స్ రికార్డును టీమిండియా సమం చేసింది.

చెలరేగిన డసన్ షనక..

చెలరేగిన డసన్ షనక..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. కెప్టెన్ డసన్ షనక(22 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్లు కుశాల్ మెండీస్(52), పాతుమ్ నిస్సంక(33) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్(3/48) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. యుజ్వేంద్ర చాహల్ ఓ వికెట్ తీసాడు.

అనంతరం భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులు చేసింది. అక్షర్ పటేల్(31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65), సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51)ల పోరాటం వృథా అయ్యింది. చివర్లో శివమ్ మావి(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) రాణించాడు.

Story first published: Friday, January 6, 2023, 14:17 [IST]
Other articles published on Jan 6, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+