ఎక్కడ దాక్కున్నావ్..?
ఫన్నీ మీమ్స్, సరదా ట్వీట్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు. రణతుంగా సెకండ్ స్ట్రింగ్ టీమ్ కామెంట్స్ ప్రస్తావిస్తూ సెటైర్లు పేల్చుతున్నారు. ద్వితీయ శ్రేణి జట్టే మీ అసలు సిసలు జట్టును చిత్తుగా ఓడించిందని ఒకరంటే.. ఈ మ్యాచ్ ఫలితం చూసాక రణతుంగా దుప్పటి కప్పుకొని పడుకోవచ్చనే ఫన్నీమీమ్ మరో నెటిజన్ షేర్ చేశాడు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, ముందుందు అసలు పండగని హెచ్చరిస్తున్నారు. ఇంకొంతమంది ఇరు జట్ల స్కోర్ కార్డ్స్ షేర్ చేస్తూ.. ఇప్పుడేమంటావ్ రణతుంగా? అని నిలదీస్తున్నారు. ఈ ఫలితంపై స్పందించే ధైర్యం ఉందా? రణతుంగా? అని మరొకరు ప్రశ్నిస్తున్నారు.
కోహ్లీసేననే ఓడించగలదు..
ఇక గబ్బర్ సేన ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీసేనను కూడా ఓడించగలదని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన కామెంట్స్‌ను కూడా షేర్ చేస్తున్నారు. ''అర్జున రణతుంగ ఈ టీమ్‌ని బి టీమ్ అన్నాడు. మేము ఆ అభిప్రాయంతో ఏకీభవించం. నువ్వు ఈ టీమ్‌ని బి టీమ్ అనుకోవచ్చు. కానీ.. భారత్ ఏ టీమ్‌ని పంపినా అది బి టీమ్ కాదు. ఎందుకంటే.. ఐపీఎల్ ద్వారా చాలా మంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. వారిని కేవలం ఒక టీమ్‌కి ఇప్పుడు పరిమితం చేయలేం. ఇంకా చెప్పాలంటే.. ఇప్పుడు శ్రీలంకలో ఉన్న భారత జట్టు.. ఇంగ్లండ్ టూర్‌లోని కోహ్లీ సేనని కూడా కొన్ని మ్యాచ్‌ల్లో ఓడించగలదు''అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
ఇది శ్రీలంక Z టీమ్..?
గబ్బర్ సేన బీ టీమ్ అయితే.. చిత్తుగా ఓడిన శ్రీలంకది Z టీమ్? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. భారత దేశవాళీ క్రికెట్‌లోని రంజీ టీమ్‌తో కూడా ప్రస్తుత శ్రీలంక టీమ్ ఓడిపోతుందని రణతుంగకు మరో అభిమాని చురకలంటించాడు. ఈ అనవసర మాటలు మాట్లాడటం ఆపేసి దేశ క్రికెట్‌ను ఎలా అభివృద్ది చేయాలో చూడాలని హితవు పలుకుతున్నారు. భారత్‌లా బెంచ్ బలం పెంచుకోవాలని, దేశవాళీ క్రికెట్‌ను పటిష్టం చేసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి గబ్బర్ సేన విజయం.. రణతుంగ తలమీదకు వచ్చింది.
ఆడుతూ పాడుతూ..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 పరుగులు చేసింది. చమిక కరుణరత్నే (35 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కెప్టెన్ దసున్ షనక (50 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్, కుల్దీప్, చాహల్ రెండేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో భారత్ 36.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 263 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ శిఖర్ ధావన్ అజేయ అర్ధ సెంచరీతో చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. సూర్యకుమార్ యాదవ్ సైతం పర్వాలేదనిపించాడు.


Click it and Unblock the Notifications












