Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: ఆ ఐపీఎల్‌ ఫ్లాఫ్ స్టార్‌కు టీమిండియాలో చోటా?: ఏబీ డివిలియర్స్

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను శ్రీలంక‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రిషభ్ పంత్‌లో ఆత్మవిశ్వాసం, శక్తి లోపించినట్లు కనిపించిందని తెలిపాడు. రిషభ్ పంత్‌కు తాను పెద్ద అభిమానినని, అతను తిరిగి తన పూర్వ వైభవాన్ని అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని డివిలియర్స్ పేర్కొన్నాడు.

IND vs SL: బుమ్రా రీఎంట్రీ.. SRH ఆటగాడిపై వేటు! భారత టెస్ట్‌ టీమ్‌ మార్పులివే!

IND vs SL: బుమ్రా రీఎంట్రీ.. SRH ఆటగాడిపై వేటు! భారత టెస్ట్‌ టీమ్‌ మార్పులివే!

రెండు టెస్ట్‌ల సిరీస్‌ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టులో రిషభ్ పంత్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. దేశవాళీ ఆఫ్ స్పిన్నర్ 33 ఏళ్ల సరాన్ష్ జైన్ తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు. పంత్ సెలెక్షన్ గురించి భారత్‌లో ఎలాంటి చర్చ జరగకపోయినా.. డివిలియర్స్ ఆశ్చర్యపోయానని చెప్పడం చర్చనీయాంశమైంది.

AB de Villiers Explains Why Rishabh Pant s Selection For Sri Lanka Tour As A Shock

పంత్ ఎంపికతో అవాక్కయ్యా..

శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత టెస్ట్ టీమ్ గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'రిషభ్ పంత్ ఎంపిక నన్ను ఆశ్చర్యపరిచింది. అతని ఫిట్‌నెస్ ఎలా ఉందో? రాణించాలనే తపన ఎంతో ఉందో చూడాలి. ఎందుకంటే ఐపీఎల్ సమయంలో అతనిలో ఆత్మవిశ్వాసం, శక్తి లోపించినట్లు కనిపించింది.

కానీ అతను మళ్లీ భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇది పంత్ అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీసుకొస్తుందని భావిస్తున్నాను. నేను అతనికి పెద్ద అభిమానిని. అతను దూకుడైన ఇంటెంట్‌తో ఆడటం చూడాలనుకుంటున్నాను.'అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.

33 ఏళ్ల వయసులో అవకాశం అద్భుతం..

దేశవాళీ క్రికెటర్ సరాన్ష్ జైన్‌కు 33 ఏళ్ల వయసులో అవకాశం దక్కడం అద్భుతమని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. 'సరాన్ష్ జైన్ ఎంపిక అయితే బిగ్ సర్‌ప్రైజ్. అతని వయసు 33 ఏళ్లు. సుదీర్ఘ కాలంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. ఇన్నాళ్లకు అతనికి అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉంది. వాషింగ్టన్ సుందర్ తరహాలోనే రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. లెఫ్టార్మ్ బ్యాటర్. అతను చాలా కాలంగా ఆడుతున్నాడు.

పాపం వైభవ్.. గంభీర్ విధానం సరికాదు: ఏబీ డివిలియర్స్

పాపం వైభవ్.. గంభీర్ విధానం సరికాదు: ఏబీ డివిలియర్స్

బౌలింగ్ గణంకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అతని సగటు దాదాపుగా 27, స్ట్రైక్ రేట్ 54గా ఉంది. మిడిల్ ఓవర్లలో బంతి పాతబడినప్పుడు శుభ్‌మన్ గిల్‌కు అతను మంచి ఆప్షన్ అవుతాడు. అతని బ్యాటింగ్ గణంకాలు కూడా బాగానే ఉన్నాయి. కొన్ని హాఫ్ సెంచరీలతో పాటు రెండు శతకాలు ఉన్నాయి. నేనైతే అతన్ని బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌ కంటే బౌలింగ్ ఆల్‌రౌండర్‌గానే పరిగణిస్తాను.'అని ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. ఆగస్ట్ 15 నుంచి భారత్, శ్రీలంక మధ్య గాలె వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుండగా.. ఆగస్ట్ 23 నుంచి రెండో టెస్ట్ మొదలవుతుంది.

Story first published: Thursday, July 30, 2026, 9:51 [IST]
Other articles published on Jul 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+