IND vs SL: భారత్‌దే బ్యాటింగ్.. సైనీ ఔట్.. మరో యువ ప్లేయర్ అరంగేట్రం

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో గాయపడ్డ సైనీ ప్లేస్‌లో సందీప్ వారియర్ అరంగేట్రం చేశాడు. ఇక శ్రీలంక జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. ఇసురు ఉడానా ప్లేస్‌లో నిస్సంక జట్టులోకి వచ్చాడు.
తొలి టీ20లో 38 పరుగులతో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టీ20లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో ఈ నిర్ణయాక మ్యాచ్‌లో విజయం సాధించి టీ20 సిరీస్‌ను గెలవాలనుకుంటుంది. మరోవైపు రెండో టీ20లో స్పూర్తిదాయక పోరాటం చేసిన లంక ఆఖరి మ్యాచ్‌లో కూడా అదే జోరు కొనసాగించాలనుకుంటుంది. కరోనాతో బలహీనమైన భారత్‌పై విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది.
తుది జట్లు
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ , దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కీపర్), నితీశ్ రాణా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చహర్, సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా.
శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక (కీపర్), సదీరా సమర విక్రమా, ధనుంజయ డిసిల్వా, రమేశ్ మెండీస్, డసన్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, వానిందు హసరంగ, నిస్సంక, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications