India vs Sri Lanka వన్డే సిరీస్.. ఆ ముగ్గురు భారత ఆటగాళ్లపై వేలాడుతున్న కత్తి!

హైదరాబాద్: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్‌కు సిద్దమైంది. గువహతి వేదికగా మంగళవారం జరగనున్న తొలి వన్డేతో ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు ఈ సిరీస్‌తో మళ్లీ మైదానంలోకి దిగుతున్నారు. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచప్‌కు ఈ సిరీస్‌తోనే రోహిత్ సేన సన్నాహకం మొదలుపెట్టనుంది. సరైన టీమ్‌కాంబినేషన్‌ను ఎంచుకోవడంపై టీమ్‌మేనేజ్‌మెంట్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఓ ముగ్గురు భారత ఆటగాళ్లకు ఈ వన్డే సిరీస్ అగ్నిపరీక్షగా మారింది. ఈ సిరీస్‌లో విఫలమైతే వారు వన్డే సిరీస్ ప్రణాళికల నుంచి తప్పుకోనున్నారు.

సూర్యకుమార్ యాదవ్..
టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. విభిన్నమైన శైలితో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అయితే వన్డే ఫార్మాట్‌లో మాత్రం సూర్య ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. గతేడాది 13 వన్డేలు ఆడిన అతను 26 సగటుతో కేవలం 260 పరుగులు మాత్రమే చేశాడు. దాంతోనే అతని వన్డే ప్లేస్‌పై సందిగ్దం నెలకొంది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలతో మిడిలార్డర్ ప్యాకప్‌గా ఉంది. ఈ సిరీస్‌లో సూర్య రాణించకుంటే అతన్ని వన్డే ఫార్మాట్‌కు పక్కనపెట్టనున్నారు. టెస్ట్ ఫార్మాట్‌లో అరంగేట్రం చేయాలనుకుంటున్న సూర్యకు ఈ సిరీస్ మంచి అవకాశం. వన్డేల్లో సత్తా చాటితే ఈ ముంబై క్రికెటర్‌ను టెస్ట్‌ల్లోకి కూడా ఎంపిక చేయనున్నారు.

కేఎల్ రాహుల్..
రెండేళ్ల క్రితం వరకు వన్డేల్లో కేఎల్ రాహుల్‌కు తిరుగులేదు. ముఖ్యంగా 2019, 2020, 2021లో అతను పరుగుల వరద పారించాడు. గతేడాది నుంచి నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. 2022లో 10 మ్యాచ్‌లు ఆడిన రాహుల్..27.89 సగటుతో 251 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్‌రేట్ 80.19 దారుణంగా ఉండగా.. రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణంగ నిలిచిన రాహుల్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో నంబర్ 5లో బ్యాటింగ్ చేయనున్న రాహుల్.. పంత్ ప్రమాదం నేపథ్యంలో కీపింగ్ కూడా చేయనున్నాడు. ఈ క్రమంలోనే రాహుల్ నిలకడగా రాణించకుంటే అతన్ని పక్కనపెట్టి యువ ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ వైస్ కెప్టెన్సీపై వేటు వేసిన టీమిండియా హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించింది.

యుజ్వేంద్ర చాహల్
శ్రీలంకతో వన్డే సిరీస్‌లో స్పిన్ కాంబినేషన్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. బ్యాటింగ్ డెప్త్ కోసం వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా శ్రీలంక లెఫ్టార్మ్ బ్యాటర్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే కుల్దీప్ యాదవ్‌ను ఆడించక తప్పేలా లేదు. యుజ్వేంద్ర చాహల్‌ను ఎంపిక చేద్దాం అంటే అతను వన్డే గణంకాలు అంత మెరుగ్గా లేవు. గతేడాది 14 వన్డేలు ఆడిన చాహల్ కేవలం 21 వికెట్లు మాత్రమే తీసాడు. మిడిల్ ఓవర్లలో బ్యాటర్లు అతనిపై విరుచుకుపడుతున్నారు. చాహల్ ఈ సిరీస్‌లో ఆడితే మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సిందే లేకుంటే బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన స్పిన్నర్లు అతని ప్లేస్‌ను భర్తీ చేసే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications