Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: రెండో టెస్ట్‌లో భారత్‌ను ఓడించేందుకు శ్రీలంక అనూహ్య ఎత్తుగడ!

సొంతగడ్డపై భారత్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో శుభారంభం చేయలేకపోయిన శ్రీలంక.. ఆఖరి మ్యాచ్‌కు సిద్దమైంది. ఆదివారం కొలంబో వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో పర్యాటక భారత్‌తో శ్రీలంక అమీతుమీ తేల్చుకోనుంది. తొలి టెస్ట్ పరాజయం నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలనే పట్టుదలతో శ్రీలంక ఉంది.

IND vs SL: శ్రీలంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ‌లో మారని భారత్ స్థానం!

IND vs SL: శ్రీలంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ‌లో మారని భారత్ స్థానం!

ఈ క్రమంలోనే భారత్ జట్టును ఓడించేందుకు బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే సమతూకమైన పిచ్‌ను సిద్దం చేయాలని శ్రీలంక క్రికెట్ బోర్డు భావిస్తోంది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 165 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో లీడ్‌లో నిలిచింది. ఈ నేపథ్యంలోనే కొలంబో వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో స్పిన్ పిచ్‌ను ఏర్పాటు చేస్తే శ్రీలంకకు నష్టం జరుగుతుందని ఆ దేశ క్రికెట్ బోర్డు యోచిస్తోంది.

IND vs SL 2nd Test Sri Lanka Opt for Balanced Pitch at SSC to Avoid Turning Track Backfiring

దినేష్ చండిమల్, కుశాల్ మెండిస్, పాతుమ్ నిస్సంక వంటి సీనియర్ ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అనుకూలంగా ఉండేలా సమతూకమైన వికెట్‌ను సిద్దం చేయాలని శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొలంబోని ఎస్‌ఎస్సీ స్టేడియం ఒకప్పుడు శ్రీలంక జట్టుకు అభేద్యమైన కంచుకోటగా ఉండేది.

1999 నుంచి 2009 మధ్య ఇక్కడ జరిగిన 12 టెస్ట్ మ్యాచ్‌ల్లో.. శ్రీలంక 6 గెలిచి 6 డ్రా చేసుకుంది. ఆ సమయంలో కుమార సంగక్కర, మహేళ జయవర్దనే పరుగులు చేయగా.. ముత్తయ్య మురళీధరన్ వికెట్లు తీసాడు. అయితే ఈ దిగ్గజాల రిటైర్ అయిన తర్వాత శ్రీలంక అనూహ్యం చతికలపడింది. దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత ఆడిన 7 టెస్ట్‌ల్లో కేవలం 3 మాత్రమే గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. భారత్‌తో ఇక్కడ జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక ఘోర పరాజయాలను చవిచూసింది.

IND vs SL: కుల్దీప్‌‌పై వేటు.. అంకుల్‌కు చోటు! శ్రీలంకతో రెండో టెస్ట్ ఆడే భారత జట్టు ఇదే!

Also Read

IND vs SL: కుల్దీప్‌‌పై వేటు.. అంకుల్‌కు చోటు! శ్రీలంకతో రెండో టెస్ట్ ఆడే భారత జట్టు ఇదే!

ఈ వికెట్‌పై టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనా. ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాయింట్స్ సాధించాలని భారత జట్టు భావిస్తోంది. అదే సమయంలో సొంతగడ్డపై ఈ సిరీస్‌ను 1-1తో సమం చేసేందుకు శ్రీలంక జట్టు కూడా దూకుడు వ్యూహాన్ని సిద్దం చేస్తోంది. సమతూకమైన పిచ్‌తో భారత్‌ను బోల్తా కొట్టించాలనే ప్రణాళికలను రచిస్తోంది.

Story first published: Friday, August 21, 2026, 14:34 [IST]
Other articles published on Aug 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+