For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మైదానంలోకి చిట్టీ పంపిన టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్.. విషయమేంటని ఆరా తీస్తున్న నెటిజన్లు!!

IND vs SL 2nd T20: Rahul Dravid Sent A Secret Message To Shikhar Dhawan with Sandeep Warrier
SL vs IND: Rahul Dravid’s Secret Chit To Shikhar Dhawan | Oneindia Telugu

కొలంబో: ప్రేమదాస మైదానంలో బుధవారం రాత్రి శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. లో స్కోరింగ్‌ నమోదైన ఈ మ్యాచ్‌లో చివర్లో కాస్త ఉత్కంఠ రేపినా.. విజయం లంకనే వరించింది. రెండో టీ20లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో టీ20 గురువారమే జరుగుతుంది. అయితే రెండో టీ20లో శ్రీలంక ఇన్నింగ్స్‌ సమయంలో టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. 12వ ఆటగాడైన సందీప్‌ వారియర్‌కు ఓ చిట్టీని ఇచ్చి మైదానంలోకి పంపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందులో ఏముందని నెటిజన్లు ఆరా తీయడం మొదలెట్టారు.

చిట్టీతో పరిగెత్తిన సందీప్‌

చిట్టీతో పరిగెత్తిన సందీప్‌

విషయంలోకి వెళితే... ఛేదనలో శ్రీలంక ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఇదే సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు బెయిల్స్‌ తీసి మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. గ్రౌండ్‌మెన్లు కూడా పిచ్‌పై కవర్‌ కప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌ సూచనలు చేసిన ఒక చిట్టీని 12వ ఆటగాడైన సందీప్‌ వారియర్‌ చేతిలో పెట్టాడు. సందీప్‌ ఆ చిట్టీని తీసుకొని మైదానంలోకి పరుగెత్తాడు. కెప్టెన్ శిఖర్‌ ధావన్‌కు ఆ చిట్టి ఇచ్చి బయటకు వచ్చేశాడు.

Tokyo Olympics 2021: ప్రపంచ రికార్డు నెలకొల్పిన చైనా అమ్మాయిలు.. 1996 తర్వాత ఇదే తొలిసారి!!

పరుగులు ఎక్కువగా ఇవొద్దు

పరుగులు ఎక్కువగా ఇవొద్దు

ఆ చిట్టీలో కోచ్ రాహుల్ ద్రవిడ్‌ ఏం పంపాడనేది ఆసక్తి కలిగించింది. నిజానికి ఆ చిట్టీలో డక్‌వర్త్‌ లూయిస్‌ గురించి రాసినట్లు సమాచారం. వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం మ్యాచ్‌ జరిగే అవకాశముందని భావించిన ద్రవిడ్‌.. దానికి తగ్గ ప్రణాళికలు చిట్టీలో రాసి పంపించినట్లు తెలిసింది. పరుగులు ఎక్కువగా ఇవొద్దు.. అప్పుడే మనం గెలిచే అవకాశాలు ఉంటాయని ఆ చిట్టీలో ద్రవిడ్ రాసివుండొచ్చు అని సమాచారం. అయితే కాసేపటికే వర్షం ఆగిపోవడంతో.. అంపైర్లు మ్యాచ్‌ను కొనసాగించారు. లంక లక్ష్యాన్ని చివరి ఓవర్లో చేధించి విజయాన్ని అందుకుంది. దాంతో ద్రవిడ్ పంపిన సందేశం టీమిండియాకు ఉపయోగపడకుండా పోయింది.

 శ్రీలంక విజయం

శ్రీలంక విజయం

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (42 బంతుల్లో 40; 5 ఫోర్లు).. అరంగేట్రం ప్లేయర్స్ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (18 బంతుల్లో 21; 1 ఫోర్‌) ఫర్వాలేదనిపించారు. అకిల ధనంజయ రెండు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో శ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి గెలుపొందింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' ధనంజయ డిసిల్వా (34 బంతుల్లో 40 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), చమిక కరుణరత్నే (6 బంతుల్లో 12 నాటౌట్‌; 1 సిక్స్‌) తమ జట్టుకు విజయాన్ని అందించారు. భారత స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు తీశాడు.

Story first published: Thursday, July 29, 2021, 13:37 [IST]
Other articles published on Jul 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+