మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ రఫ్పాడించారు. దాంతో శ్రీలంక సాధారణ లక్ష్యానికే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో(62 బంతుల్లో 5 ఫోర్లతో 40), కామిందు మెండీస్(44 బంతుల్లో 4 ఫోర్లతో 40) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/30) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే ఓపెనర్ పాతుమ్ నిస్సంక కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండే, కుశాల్ మెండీస్‌తో కలిసి ఆచితూచి ఆడాడు. డిఫెన్స్ ఆడిన ఈ ఇద్దరూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. దాంతో తొలి పవర్ ప్లేలో శ్రీలంక వికెట్ నష్టానికి 42 పరుగులే చేసింది.
74 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని వాషింగ్టన్ సుందర్ విడదీసాడు. వరుస ఓవర్లో ఇద్దర్నీ ఔట్ చేశాడు. ముందుగా హాఫ్ సెంచరీకి చేరువైన అవిష్కా ఫెర్నాండోను రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చిన సుందర్... మరుసటి ఓవర్‌లో కుశాల్ మెండీస్(30)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.
సదీర విక్రమా(14)ను అక్షర్ పటేల్ ఔట్ చేయగా.. జనిత్ లియాంగే(12)ను కుల్దీప్ యాదవ్ రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే నిలకడగా ఆడుతున్న చరిత్ అసలంక(25)ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేయడంతో శ్రీలంక 136 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో 200 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ దునిత్ వెల్లలాగే(39), కామిందు మెండీస్ జట్టును ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు 72 పరుగులు జోడించి పోరాడే లక్ష్యాన్ని అందించారు. చివరి రెండు బంతులకు కామిందు మెండీస్, అకీల ధనుంజయలు శ్రేయస్ అయ్యర్, కోహ్లీ సన్నింగ్ త్రోలతో రనౌటయ్యారు.