IND vs SL: మలుపు తిప్పిన ప్రసిధ్ కృష్ణ.. భారత్‌కు భారీ ఆధిక్యం!
శ్రీలంకతో తొలి టెస్ట్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 284 పరుగులకు కుప్పకూలింది. సోనాల్ దినుషా(100) సెంచరీతో చెలరేగగా.. నిరోషన్ డిక్‌వెల్లా(115 బంతుల్లో 7 ఫోర్లతో 80) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్(4/76) నాలుగు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా(3/57) మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.
అంతకుముందు 460/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(230 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 167) సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(175 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 82) శతకాన్ని చేజార్చుకున్నాడు. ధ్రువ్ జురెల్(68 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య(4/109) నాలుగు వికెట్లు తీయగా.. కేశర నువాంత(3/175) మూడు వికెట్లు పడగొట్టాడు. అసితా ఫెర్నాండో(2/63) రెండు వికెట్లు తీసాడు.

నిప్పులు చెరిగిన భారత బౌలర్లు..
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు షాకిచ్చారు. సిరాజ్, జడేజా, మానవ్ సుతార్ నిప్పులు చెరగడంతో శ్రీలంక 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దాంతో శ్రీలంక 99/5 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. తొలి సెషన్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. రెండో సెషన్‌లో సొనాల్ దినుషా, నిరోషణ్ డిక్‌వెల్లా శ్రీలంకను ఆదుకున్నారు.
అద్వితీయమైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో నిరోషన్ డిక్‌వెల్లా 67 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. దినుషా 92 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు. దాంతో శ్రీలంక 215/5 స్కోర్ టీ బ్రేక్‌కు వెళ్లింది. దినుషా, డిక్‌వెల్ల అద్భుత బ్యాటింగ్‌తో రెండో సెషన్‌లో శ్రీలంకనే పైచేయి సాధించింది.
మలుపు తిప్పిన ప్రసిధ్ కృష్ణ
ఆఖరి సెషన్‌లో భారత బౌలర్లు జూలు విధిల్చారు. 146 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని ప్రసిధ్ కృష్ణ విడదీసాడు. సెంచరీ దిశగా సాగిన నిరోషన్ డిక్‌వెల్లా(80)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్‌తో మ్యాచ్ భారత్‌వైపు మలుపు తిరిగింది. ఆ వెంటనే కేశర నువాంత(2)ను జడేజా ఔట్ చేయగా.. ప్రబాత్ జయసూర్య(10)ను మానవ్ సుతార్ వెనక్కిపంపాడు.
ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు సోనాల్ దినూషా.. 167 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే అతన్ని జడేజా ఎల్బీగా పెవిలియన్ మార్చాడు. లాహిరు కుమార(10)ను మానవ్ సుతార్ ఔట్ చేయడంతో శ్రీలంక ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆ వెంటనే వర్షం రావడంతో అంపైర్లు మూడో రోజు ఆటను ముగించారు. నాలుగో రోజు ఆటలో భారత్ తొలి సెషన్‌లోనే 130 పరుగులు చేసి శ్రీలంక ముందు 300 ప్లస్ రన్స్ లక్ష్యాన్ని నమోదు చేయాలి. అప్పుడే ఈ మ్యాచ్ భారత్ వశమవుతోంది. వర్షం అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో చాలా తెలివిగా ఆడాల్సిన అవసరం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

