IND vs SL: సెంచరీ ముంగిట మైదానం వీడిన కేఎల్ రాహుల్.. ఎందుకంటే?
రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అనూహ్యంగా మైదానం వీడాడు. అద్వితీయమైన బ్యాటింగ్‌తో సెంచరీ దిశగా సాగిన రాహుల్.. కండరాలు పట్టేడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దాంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు.
శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేఎల్ రాహుల్ తన అనుభవంతో సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. యశస్వి జైస్వాల్(32) వెనుదిరిగినా.. యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

ఓవైపు తాను ఆడుతూనే మరోవైపు యువ బ్యాటర్ పడిక్కల్‌కు మార్గదర్శిగా నిలిచాడు. ఈ క్రమంలో పడిక్కల్ 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రాహుల్ 127 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అతనంతరం ఈ జోడీ అదే జోరు కొనసాగించడంతో టీమిండియా 197/1 స్కోర్‌తో టీ బ్రేక్ వెళ్లింది.
ఆఖరి సెషన్ ప్రారంభానికి ముందు మైదానంలోకి వచ్చేందుకు సిద్దమైన కేఎల్ రాహుల్.. చేతి కండరాలు, కాలి కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. ఫిజియోల సాయంతో మైదానంలో వచ్చేందుకు ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. దాంతో రిటైర్డ్‌గా వెనుదిరిగ్గా.. గిల్ క్రీజులోకి వచ్చాడు. పడిక్కల్ 134 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్(16) తీవ్రంగా నిరాశపర్చాడు. ప్రబాత్ జయసూర్య బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి రిషభ్ పంత్(3 నాటౌట్)రాగా వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 2 వికెట్లకు 239 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్(107 బ్యాటింగ్)తో పాటు రిషభ్ పంత్(3 బ్యాటింగ్) ఉన్నాడు.
శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య ఒక్కడే ఒక వికెట్ తీసాడు. యశస్వి జైస్వాల్ రనౌట్ అయిన సంగతి తెలిసిందే. వర్షం ఆగితే మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లేదంటే తొలి రోజు ఆటను అంపైర్లు నిలిపి వేయనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

