For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rohit Sharma ట్రేడ్ మార్క్ రివ్యూ.. రాహుల్ మాట వినకుండా..! (వీడియో)

IND vs SA, World Cup 2023: క్రికెట్‌లో అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించే డీఆర్‌ఎస్ (డిసిషన్ రివ్యూ సిస్టమ్).. రోహిత్ శర్మ రివ్యూ సిస్టమ్‌గా మారిపోయింది. డీఆర్‌ఎస్ నిర్ణయాల్లో రోహిత్ శర్మ సక్సెస్ రేట్‌ను చూస్తే ఈ మాట అనకుండా ఉండలేరు. ఒకప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇలానే కచ్చితమైన రివ్యూలతో అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు.

వికెట్ల వెనుకాల నుంచి ధోనీ రివ్యూ తీసుకున్నాడంటే.. ఫీల్డ్ అంపైర్ కూడా తాను తప్పు చేశానని ఫీలయ్యేవాడు. అంత కచ్చితంగా ధోనీ డీఆర్‌ఎస్ నిర్ణయాలు ఉండేవి. డీఆర్‌ఎస్ అంటే ధోనీ రివ్యూ సిస్టమ్ అని ఫ్యాన్స్ కొనియాడేవారు. తాజాగా రోహిత్ శర్మ సైతం అదే తరహాలో డీఆర్‌ఎస్ ఫలితాలు సాధిస్తున్నాడు.

IND vs SA, World Cup 2023: Rohit Sharma to take DRS review, gets Klaasens wicket goes viral

ధోనీలా వికెట్ కీపర్ కాకున్నా.. కరెక్ట్‌గా అంచనా వేస్తున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ తన ట్రేడ్‌మార్క్ రివ్యూతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఓవైపు వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ వద్దని వారిస్తున్నా.. రివ్యూ తీసుకొని సంచలన ఫలితాన్ని రాబట్టాడు. రవీంద్ర జడేజా వేసిన 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ ఐదో బంతిని హెన్రీచ్ క్లాసెన్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతను బంతిని సరిగ్గా అంచనా వేయలేక వికెట్ల ముందు దొరికిపోయాడు. భారత ఆటగాళ్లు అప్పీల్ చేసినా అంపైర్ కుమార ధర్మసేన ఔటివ్వలేదు. బంతి లెగ్ వికెట్‌సైడ్ వెళ్తుందని అంపైర్‌తో పాటు కీపర్ భావించారు.

జడేజా మాత్రం ఔటేనంటూ పట్టు బట్టగా.. రాహుల్ వద్దని వారించాడు. రోహిత్ మాత్రం రివ్యూ తీసుకొని ఫలితాన్ని రాబట్టాడు. రిప్లేలో బంతి వికెట్లను తాకడంతో క్లాసెన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల‌కు 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(121 బంతుల్లో 10 ఫోర్లతో 101 నాటౌట్) రికార్డు సెంచరీతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు.

సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, టబ్రైజ్ షంసీ, ఎయిడెన్ మార్క్‌రమ్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన సౌతాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా(5/33) ఐదు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించగా.. మహమ్మద్ షమీ(2/18), కుల్దీప్ యాదవ్(2/7) రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్(1/11) ఓ వికెట్ దక్కింది.

సఫారీ బ్యాటర్లలో మార్కో జాన్సెన్(14), వాన్ డెర్ డస్సెన్(13), టెంబా బవుమా(11), డేవిడ్ మిల్లర్(11) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

Story first published: Sunday, November 5, 2023, 21:31 [IST]
Other articles published on Nov 5, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+