IND vs SA: తొక్కలో హాఫ్ సెంచరీ వద్దు మామ.. కొట్టేసేయ్! విరాట్ సెల్ఫ్‌లెస్ గేమ్‌కు ఫ్యాన్స్ ఫిదా! (వీడియో)

గౌహతి: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో టీ20లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ(28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడని చెప్పే కంటే.. వదులుకున్నాడని చెప్పడం కరెక్ట్. అవును భారత్ ఇన్నింగ్స్‌లో 6 బంతులు మిగిలుండగానే 49 పరుగుల మార్క్ అందుకున్న కోహ్లీ.. స్ట్రైకింగ్ తీసుకునే అవకాశం ఉన్నా.. తీసుకోలేదు.

హాఫ్ సెంచరీ వదులుకున్నాడు..
జట్టు మేలు ముఖ్యమని భావించిన అతను తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడు. ఆఖరి ఓవర్‌లో స్ట్రైకింగ్‌కు వచ్చిన దినేశ్ కార్తీక్ తొలి బంతిని వదిలేసి రెండో బంతిని బౌండరీకి తరలించాడు. మూడో బంతిని డాట్ చేసిన కార్తీక్ నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచాడు. వెంటనే విరాట్ దగ్గరకు వెళ్లి.. స్ట్రైకింగ్ కావాలా? హాఫ్ సెంచరీ చేసుకుంటావా? అని అడిగాడు. అయితే కోహ్లీ మాత్రం స్ట్రైకింగ్ తీసుకునేందుకు నిరాకరించాడు. ఇన్నింగ్స్‌ను ముగించేయాలని, జట్టు కంటే తనకు హాఫ్ సెంచరీ ముఖ్యం కాదని చెప్పాడు. దాంతో కార్తీక్ మరో భారీ సిక్సర్ బాది.. చివరి బంతికి సింగిల్ తీసాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
నెటిజన్లు ఫిదా...
జట్టు ప్రయోజనం కోసం హాఫ్ సెంచరీని వదులుకున్న విరాట్ కోహ్లీ సెల్ఫ్ లెస్ గేమ్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. కోహ్లీ అద్భుతమైన ఆటగాడని, అతనికి జట్టు విజయమే ముఖ్యమని, ఈ విషయం మరోసారి నిరూపితమైందని కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ యాష్ ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. మరోసారి కోహ్లీ అందరి మనసులు గెలుచుకున్నాడని, ఇలా చేయడం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ అనేక సార్లు ఇలాంటి త్యాగాలు చేశాడని గుర్తు చేస్తున్నారు.

సూర్య చుక్కలు..
ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. కేఎల్ రాహుల్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్), రోహిత్ శర్మ(37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43)కీలక ఇన్నింగ్స్ ఆడారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ ఒక్కడే రెండు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. పోటీపడి మరీ పరుగిలిచ్చారు.

మిల్లర్ కిల్లర్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 221 పరుగులే చేసింది. డేవిడ్ మిల్లర్(47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. క్వింటన్ డికాక్(48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 174 పరుగులు జోడించారు. భారత్‌కు విజయానందమే లేకుండా చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీసినా... 62 పరుగులు సమర్పించుకున్నాడు. అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు. దీపక్ చాహర్(0/24) మినహా అంతా ధారళంగా పరుగులిచ్చారు. మూడో టీ20 మంగళవారం ఇండోర్ వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications