కోహ్లీకి నెట్స్‌లో బౌలింగ్ చేసి..
అయితే ఇదే మార్కో జాన్సెన్.. గత సౌతాఫ్రికా పర్యటన 2018లో విరాట్ కోహ్లీకి నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. తన ట్విన్ సోదరుడుతో కలిసి నెట్స్‌లో విరాట్‌కు బంతులేసాడు. ఇక తాజా పర్యటనలో ఫస్ట్ టెస్ట్‌లోనే తుది జట్టులో చోటు దక్కించుకున్న మార్కో జాన్సెన్.. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఒకే వికెట్ తీసిన జాన్సెన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పటికే మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు స్టార్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్, దూకుడుగా ఆడుతున్న అజింక్యా రహానేలను పెవియన్ చేర్చి భారత్‌కు గట్టి షాకిచ్చాడు. ఇక విరాట్ కోహ్లీని జాన్సెన్ ఔట్ చేయడంతో.. 2018లో అతనికి నెట్స్ బౌలింగ్ చేసిన నాటి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. జాన్సెన్‌ను క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు కొనియాడుతున్నారు. బచ్చాగాడనుకుంటే కోహ్లీనే బకరా చేసిండని మెచ్చుకుంటున్నారు.

2019లో చివరిసారిగా..
ఇక విరాట్ కోహ్లీ తాజా వైఫల్యంతో ఈ ఏడాది కూడా అతని ఖాతాలో సెంచరీ చేరలేదు. మూడు ఫార్మాట్లలో కలిపి ఒక్క సెంచరీ బాదలేదు. టెస్ట్ క్రికెట్‌లో ఈ ఏడాది 10 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. మొత్తం 11 మ్యాచ్‌ల్లో 28.21 సగటుతో 536 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. ఈ ఏడాది మూడు వన్డేలు మాత్రమే ఆడిన కోహ్లీ 43 సగటుతో 129 రన్స్ చేశాడు. 8 టీ20ల్లో 37.7 సగటుతో 299 రన్స్ చేయగా.. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో కోల్‌కతా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డేనైట్ టెస్ట్‌లో చివరిసారిగా సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. ఆపై ఇప్పటివరకూ మరో శతకం సాధించలేదు. కరోనా వైరస్ ప్రభావం ఉన్న 2020, 2021లో ఒక్క శతకం బాదలేదు.

ధాటిగా ఆడాలని..
చివరి రోజు వర్షం పడే సూచనలు ఉన్న నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్ వ్యూహం మార్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 130 పరుగుల ఆధిక్యం లభించడం.. రెండో ఇన్నింగ్స్‌లో 100 పరుగులు కూడా పూర్తవ్వడంతో ధాటిగా ఆడాలని ప్రణాళిక రచించింది. ఆ క్రమంలోనే లంచ్ సెషన్ అనంతరం ఫాస్ట్‌గా ఆడే ప్రయత్నం చేసిన విరాట్ కోహ్లీ.. వికెట్ ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత చతేశ్వర్ పుజారా(16), వరుస బౌండరీలతో దూకుడు కనబర్చిన అజింక్యా రహానే(20) ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో అశ్విన్(13 బ్యాటింగ్), రిషభ్ పంత్(19 బ్యాటింగ్) ఉన్నారు. ప్రస్తుతం భారత్ 275 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ లీడ్ 300 మార్క్ ధాటిన తర్వాత టీమిండియా డిక్లేర్ ఇచ్చే చాన్సుంది.

చెలరేగిన షమీ..
ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 327 పరుగులకు ఆలౌటవ్వగా.. సౌతాఫ్రికా 197 పరుగులకే కుప్పకూలింది. మహమ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగగా.. శార్దూల్, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్‌కు ఓ వికెట్ దక్కింది. దాంతో భారత్‌కు 130 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి రోజు బ్యాటుతో అదరగొట్టిన టీమ్ ఇండియా మంగళవారం బ్యాటుతో తేలిపోయింది.ఎంగిడి ధాటికి 55 పరుగులకే మిగతా 7 ఏడు వికెట్లు కోల్పోయి 327తో సరిపెట్టుకుంది. కానీ తగ్గేదేలే అంటూ తర్వాత షమి నిప్పులు చెరగడంతో విలువైన ఆధిక్యం సంపాదించి, మ్యాచ్‌పై పట్టుబిగించింది.


Click it and Unblock the Notifications
