For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: కళ్లు చెదిరే ఔట్ స్వింగర్.. బిత్తరపోయిన విరాట్ కోహ్లీ! (వీడియో)

కళ్లు చెదిరే ఔట్ స్వింగర్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బిత్తరపోయాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో కగిసో రబడా వేసిన ఈ బంతిని ఏ మాత్రం అంచనా వేయలేకపోయిన కోహ్లీ.. క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. సాధారణంగా ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌తో పాటు స్వింగర్స్ ఆడటంలో కోహ్లీ తడబడుతాడు.

కెరీర్ ఆరంభం నుంచి కోహ్లీ ఈ బాల్స్ ఆడేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ బ్యాటింగ్‌కు రాగానే బౌలర్లంతా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌తో పాటు స్వింగర్స్, ఔట్ స్వింగర్స్‌తో ఇబ్బంది పెడుతుంటారు. తాజా మ్యాచ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. కగిసో రబడా బౌలింగ్‌లో విరాట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.

 IND vs SA: Virat Kohli gets out on unplayable delivery from Kagiso Rabada

రబడా వేసిన 31వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని రబడా అద్భుతమైన ఔట్ స్వింగర్ వేయగా.. కోహ్లీ అంచనా వేయలేకపోయాడు. ఆఫ్ స్టంప్ లైన్‌లో అతను ఆడే ప్రయత్నం చేయగా.. బంతి అతని బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతిలో పడింది. దాంతో టీమిండియా 107 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.

64 బంతులు ఆడిన కోహ్లీ 5 ఫోర్లతో 38 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే అతనికి లైఫ్ లభించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన కోహ్లీని.. రబడా పెవిలియన్ చేర్చాడు. విరాట్ కోహ్లీ బలహీనతకు తగ్గట్లు ప్లాన్ చేసి మరీ రబడా అతన్ని ఔట్ చేశాడు.

ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 68 పరుగులు జోడించాడు. విరాట్ కోహ్లీ ఔటవ్వడంతో టీమిండియా ఆలౌట్ దిశగా సాగుతోంది. క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్‌(8)ను కూడా రబడా పెవిలియన్ చేర్చాడు.

ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్‌తో పాటు శార్దూల్ ఠాకూర్ ఉన్నాడు. 40 ఓవర్లు ముగిసేసరికి భారత్ 6 వికెట్లకు 148 పరుగులు చేసింది.

Story first published: Tuesday, December 26, 2023, 18:05 [IST]
Other articles published on Dec 26, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+