For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: రికార్డుల రారాజు కోహ్లీ ఖాతాలో మరో ఘనత.. రాహుల్ ద్రవిడ్ రికార్డు బద్దలు!

IND vs SA: Virat Kohli breaks Rahul Dravid Record in 3rd Test

కేప్‌టౌన్‌: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో హాఫ్ సెంచరీ బాదిన కోహ్లీ .. సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు.

సఫారీ గడ్డపై రాహుల్ ద్రవిడ్‌ 11 టెస్ట్‌ల్లో 624 పరుగులు చేయగా.. తాజా ఇన్నింగ్స్‌తో కోహ్లీ అధిగమించాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కోహ్లీ.. ద్రవిడ్‌ను వెనక్కునెట్టాడు. ఈ జాబితాలో దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్‌ టెండూల్కర్‌ (15 మ్యాచ్‌ల్లో 1161 పరుగులు) అగ్రస్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికాలో ఇప్పటివరకు 7 టెస్ట్‌లు ఆడిన కోహ్లీ.. 50కి పైగా సగటుతో 688 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన చెత్త బ్యాటింగ్‌తో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 223 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(201 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 79) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. చతేశ్వర్ పుజారా(77 బంతుల్లో 7 ఫోర్లతో 43) పర్వాలేదనిపించాడు. ఈ ఇద్దరూ మినహా మరే బ్యాట్స్‌మన్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా(4/73) నాలుగు, మార్క్ జాన్సేన్(3/55) మూడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు. లుంగి ఎంగిడి, కేశవ్ మహరాజ్, ఓలివర్ తలో వికెట్ తీశారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో ఎయిడెన్ మార్క్‌రమ్(8 బ్యాటింగ్), కేశవ్ మహరాజ్(6బ్యాటింగ్) ఉన్నారు. బుమ్రా బౌలింగ్‌లో డీన్ ఎల్గర్(3) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

Story first published: Tuesday, January 11, 2022, 22:39 [IST]
Other articles published on Jan 11, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+