For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఫైటింగ్ నాక్ ఆడిన విరాట్ కోహ్లీ.. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ రికార్డును అధిగమించాడు. డబ్ల్యూటీసీ టోర్నీల్లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 57 ఇన్నింగ్స్‌ల్లో 2101 పరుగులు చేశాడు.

రోహిత్ శర్మ 42 ఇన్నింగ్స్‌ల్లో 2097 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. చతేశ్వర్ పుజారా(1769) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సౌతాఫ్రికాతో టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగానూ విరాట్ కోహ్లీ రికార్డుకెక్కాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.

 IND vs SA: Virat Kohli Breaks Coach Rahul Dravids Massive Record In South Africa

ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కోహ్లీ వెనక్కినెట్టాడు. సౌతాఫ్రికాతో 21 మ్యాచ్‌ల్లో ద్రవిడ్ 1252 రన్స్ చేయగా.. కోహ్లీ 15 మ్యాచ్‌ల్లో 1268 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా.. వీరేంద్ర సెహ్వాగ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 25 టెస్ట్‌ల్లో సచిన్ 1741 రన్స్ చేయగా.. వీరేంద్ర సెహ్వాగ్ 1306 రన్స్ చేశాడు. మరో 38 పరుగులు చేస్తే విరాట్.. సెహ్వాగ్ రికార్డును కూడా అధిగమిస్తాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పేస్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై సౌతాఫ్రికా పేసర్లు చెలరేగడంతో టీమిండియా 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో కోహ్లీ, అయ్యర్ నాలుగో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. నాలుగు ఓవర్ల వ్యవధిలోనే ఈ ఇద్దరు వెనుదిరగ్గా.. అశ్విన్(8) కూడా నిరాశపరిచాడు.

ఈ పరిస్థితుల్లో శార్తూల్ ఠాకూర్‌తో కలిసి కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నాడు. ఏడో వికెట్‌కు 43 పరుగులు జోడించిన అనంతరం శార్దూల్ ఔటవ్వగా.. జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రాముల్.. జట్టు స్కోర్‌ను 200 ధాటించాడు.

Story first published: Tuesday, December 26, 2023, 19:51 [IST]
Other articles published on Dec 26, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+