For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు 2000 ప్లస్ రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ(82 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 76) 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ సాధించాడు.

ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ఏడు సార్లు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 2000 ప్లస్ రన్స్ చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రికార్డును అధిగమించాడు. కుమార సంగక్కర 6 సార్లు 2000 ప్లస్ రన్స్ చేశాడు. ఈ ఏడాది కోహ్లీ రెండు ఫార్మాట్లలో కలిపి 2048 పరుగులు చేశాడు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో అతను ఈ ఏడాది టీ20లకు దూరంగా ఉన్నాడు.

IND vs SA: Virat Kohli becomes Most times scored 2000+ runs in a calander year

2012లో 2186 రన్స్ చేసి కోహ్లీ.. 2014లో 2286, 2016లో 2595, 2017లో 2818, 2018లో 2735, 2019లో 2455, 2023లో 2048 రన్స్ చేశాడు. అలాగే టెస్ట్‌ల్లో సౌతాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు.

ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్(1306) రికార్డు‌ను అతను అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 25 టెస్ట్‌ల్లో సచిన్ 1741 రన్స్ చేయగా కోహ్లీ.. 1350 రన్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 131 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(82 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 76) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రే బర్గర్ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కగిసో రబడాకు రెండు వికెట్లు దక్కాయి.

256/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 108.4 ఓవర్లలో 408 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డీన్ ఎల్గర్(287 బంతుల్లో 28 ఫోర్లతో 185) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా.. టెయిలెండర్ మార్కో జాన్సెన్(147 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 84 నాటౌట్) శతకాన్ని అందుకోలేకపోయాడు. భారత బౌలర్లలో బుమ్రాకు తోడుగా సిరాజ్ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసారు.

ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు కుప్పకూలింది. కేఎల్ రాహుల్(101) శతకంతో చెలరేగగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

Story first published: Thursday, December 28, 2023, 20:12 [IST]
Other articles published on Dec 28, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+