నోబాల్‌కు ఔట్..
అయితే రబడా వేసిన ఈ బంతి నో బాల్ అని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ షేర్ చేసిన ఫొటోల్లో రబడా ఓవర్ స్టెప్ అయినట్లు కనిపిస్తుంది. అంపైర్లు ఈ తప్పిదాన్ని గుర్తించి ఉంటే శార్దూల్ ఔటయ్యేవాడు కాదని, ముఖ్యంగా థర్డ్ అంపైర్ ఏం చేస్తున్నాడని మండిపడుతున్నారు.
'థర్మ్ అంపైర్ నిద్ర పోతున్నాడా? నోబాల్‌కు ఠాకూర్ ఔటయ్యాడు'అని ఓ యూజర్ ట్వీట్ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో రబడా వరుసగా ఓవర్ స్టెప్ అవుతూనే ఉన్నాడని, కానీ అంపైర్లు మాత్రం గుర్తించడం లేదని మరో నెటిజన్ ఆరోపించాడు. టీవీ రిప్లేలో రబడా నో బాల్స్ వేసిన విషయం స్పష్టంగా కనిపిస్తున్నా.. అంపైర్లు పట్టించుకోవడం లేదని కామెంట్ చేశాడు. రాత్రికి రాత్రే రూల్స్ అయితే మార్చలేదు? కదా? అని సెటైర్లు పేల్చాడు.
భారత్ 79/3
16/1 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. క్రీజులో చతేశ్వర్ పుజారా(12 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ(18 బ్యాటింగ్) ఉన్నారు. ఓవర్ నైట్ స్కోర్‌కు 22 పరుగులు జోడించిన అనంతరం.. శార్దూల్ ఠాకూర్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన పుజారాతో రాహుల్ ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశాడు.
కానీ వరుస బౌన్సర్లతో సౌతాఫ్రికా పేసర్లు చెలరేగడంతో కాస్త ఇబ్బంది పడిన రాహుల్ చివరకు ఎంగిడి బౌలింగ్‌లో స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన విరాట్.. పుజారాతో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ప్రస్తుతం భారత్ 209 పరుగుల ఆధిక్యంలో ఉంది.
130 పరుగుల ఆధిక్యం..
ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 327 పరుగులకు ఆలౌటవ్వగా.. సౌతాఫ్రికా 197 పరుగులకే కుప్పకూలింది. మహమ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగగా.. శార్దూల్, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్‌కు ఓ వికెట్ దక్కింది. దాంతో భారత్‌కు 130 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి రోజు బ్యాటుతో అదరగొట్టిన టీమ్ ఇండియా మంగళవారం బ్యాటుతో తేలిపోయింది.ఎంగిడి ధాటికి 55 పరుగులకే మిగతా 7 ఏడు వికెట్లు కోల్పోయి 327తో సరిపెట్టుకుంది. కానీ తగ్గేదేలే అంటూ షమి నిప్పులు చెరగడంతో విలువైన ఆధిక్యం సంపాదించి, మ్యాచ్‌పై పట్టుబిగించే దిశగా సాగుతోంది.


Click it and Unblock the Notifications
