IND vs SA: టీమిండియాను వేధిస్తున్న 19వ ఓవర్.. మరోసారి బౌండరీల మోత.. సిక్సర్ల జాతర!

హైదరాబాద్: టీమిండియాను 19వ ఓవర్ వేధిస్తూనే ఉంది. బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కీలక ప్రపంచకప్ ముందు ఈ ఓవర్‌లో భారత బౌలర్లు ధారళంగా పరుగులిస్తుండటం అటు టీమ్‌మేనేజ్‌మెంట్‌తో ఇటు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎంతటి మంచి బౌలర్ అయినా.. అప్పటి వరకు తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టినవాడైనా..19వ ఓవర్‌లో తేలిపోతున్నాడు.
భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ ఇలా ఎవరూ వేసినా పరుగుల మోత మోగుతుంది. తాజాగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. తన తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు తీసి జోరు కనబర్చిన అర్ష్‌దీప్ సింగ్.. 19వ ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నాడు.
భారీ స్కోర్ చేయకుంటే..
భారత్ భారీ స్కోర్ చేయడంతో బచాయించింది కానీ.. ఓ 10 పరుగులు తక్కువ చేసినా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయేది. అంత దరిద్రంగా భారత బౌలర్లు బౌలింగ్ చేశారు. చివరి 12 బంతుల్లో 63 పరుగులు చేయాలి. ఏ లెక్కన చూసుకున్నా ఇది చేయడం అసాధ్యం. రోహిత్‌కు అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ రూపంలో రెండే ఆప్షన్లు ఉన్నాయి.
ముందు జాగ్రత్తగా అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ ఇవ్వగా.. అతను మొదటి బంతినే నోబాల్‌గా సంధించాడు. ఆ తర్వాత సూపర్ యార్కర్‌తో ఒకే పరుగుచ్చాడు. మూడో బంతికి లోయర్ ఫుల్ టాస్ వేయడంతో మిల్లర్ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత మరో రెండు బౌండరీలతో పాటు సిక్సర్ కొట్టి 26 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్‌లో అర్ష్‌దీప్ బౌలింగ్ చేసిన తీరు అందరిని విస్మయానికి గురి చేసింది. ఎన్నడు లేని విధంగా అతను తొలి ఓవర్ అద్భుతంగా వేసి కూడా తన స్పెల్‌లో 62 పరుగులు ఇచ్చుకున్నాడు.
ఆసియాకప్ నుంచి..
ఆసియాకప్ 2022 నుంచి 19వ ఓవర్ ఎవరూ వేసినా ధారళంగా పరుగులిస్తున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ 19వ ఓవర్ భారత్‌కు కలిసి రాలేదు. అప్పటి వరకు తన స్వింగ్‌తో ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి సౌతాఫ్రికా పతనాన్ని శాసించిన అర్ష్‌దీప్ సింగ్ ఇదే 19వ ఓవర్‌లో చేతులెత్తేసాడు. తనదైన యార్కర్లతో కట్టడి చేసే ప్రయత్నం చేసినా.. 17 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌లో కేశవ్‌మహరాజ్ రెండు బౌండరీలతో పాటు ఓ భారీ సిక్సర్ బాదాడు.
బుమ్రా సైతం..
ఆసియాకప్‌లో భువనేశ్వర్ కుమార్ సైతం 19వ ఓవర్లలోనే ధారళంగా పరుగులిచ్చి భారత ఓటమికి కారణమయ్యాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో మరోసారి అతనికి 19వ ఓవర్ ఇచ్చినా అదే సీన్ రిపీట్ అయ్యింది. దాంతో చివరి టీ20లో 19వ ఓవర్‌ను రోహిత్ బుమ్రా చేతికివ్వగా అతను కూడా ధారళంగా పరుగులిచ్చాడు. ఓ సిక్స్, ఫోర్‌తో పాటు ఓవర్ త్రో ద్వారా 6 పరుగులు రావడంతో మొత్తం 18 పరుగులు సమర్పించుకున్నారు. దాంతో 19వ ఓవర్ భారత బౌలర్లకు గండంలా మారిందనే చర్చ మొదలైంది.
నవ్విస్తున్న ఫన్నీ మీమ్స్..
19వ ఓవర్‌లో భారత బౌలర్లు విఫలమవుతున్న నేపథ్యంలో అభిమానులు ఫన్నీ మీమ్స్ సృష్టిస్తున్నారు. డెత్ ఓవర్ వైఫల్యం మీదంటే మీదని భారత బౌలర్లు ఒకరిపై ఒకరు నెట్టేస్తున్నారనే సెటైరికల్ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. భువనేశ్వర్‌ను ట్రోల్ చేసినవారిని తప్పుబడుతున్నారు. భువీ ఒక్కడే కాదు బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ కూడా విఫలమయ్యారని కామెంట్ చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు సైతం 19వ ఓవర్ టీమిండియాకు కలిసిరావడం లేదని ట్వీట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications