Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: అందుకే సంజూ శాంసన్‌ను పక్కన పెట్టాం: సూర్యకుమార్ యాదవ్

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో కటక్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సౌతాఫ్రికా టీ20 కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. డ్యూ ఫ్యాక్టర్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. మంచు మ్యాచ్ ఆసాంతం కొనసాగే అవకాశం ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది.

టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ముందు ఈ సిరీస్‌ మా సన్నాహకానికి ఉపయోగపడనుంది. పిచ్ కండిషన్స్‌తో పాటు టీమ్ కాంబినేషన్‌పై ఓ నిర్ణయానికి రావచ్చు. సౌతాఫ్రికాలో మేం ఇలాంటి కండిషన్స్‌ను పొందలేం. కాబట్టి ఈ సిరీస్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాం.'అని మార్క్‌రమ్ చెప్పుకొచ్చాడు.

టాస్ ఓడినందుకు సంతోషంగానే ఉందని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. తాము ముందుగా బ్యాటింగే చేయాలనుకున్నామని చెప్పాడు. తుది జట్టు ఎంపిక తలనొప్పిగా మారిందని చెప్పిన సూర్యకుమార్ యాదవ్.. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే సంజూ శాంసన్‌తో పాటు కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా ఆడటం లేదని తెలిపాడు.

IND vs SA Suryakumar Yadav Reveals Why Sanju Samson Is Not Playing the 1st T20I

'ఈ వికెట్‌ను చూసి కొంచెం గందరగోళానికి గురయ్యాం. పిచ్ నిన్న కొంచెం పచ్చగా కనిపించింది. ముందుగా బ్యాటింగ్ చేయడానికి సంతోషంగా ఉన్నాం. పిచ్ కండిషన్స్‌ను ఉపయోగించుకొని మా పరుగులను డిఫెండ్ చేసుకోవాలనుకుంటున్నాం. మంచు(డ్యూ) బౌలర్లకు సవాల్‌గా మారనుంది. ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది. ఆ టోర్నీ గురించి ఆలోచించకుండా.. ఓ సవాల్‌గా తీసుకున్నాం. ఆస్ట్రేలియాలో మాకు మంచి సిరీస్ లభించింది.

ఇప్పుడు సౌతాఫ్రికాతో బరిలోకి దిగుతున్నాం. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో తలపడనున్నాం. ఇది మంచి సన్నాహం. ఈ సిరీస్‌లను ఆస్వాదించాలనుకుంటున్నాం. తుది జట్టు ఎంపిక తలనొప్పిగా మారింది. ఈ మ్యాచ్‌కు సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా ఆడటం లేదు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. ' అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

సౌతాఫ్రికా:

క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డానోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, లుథో సిపామ్లా, లుంగీ ఎన్గిడి, ఎన్రిక్ నోర్ట్జే.

భారత్:

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.

Story first published: Tuesday, December 9, 2025, 18:54 [IST]
Other articles published on Dec 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+