Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: అందుకే తుది జట్టులో మార్పులు చేయలేదు: సూర్యకుమార్ యాదవ్

సౌతాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ మరో ఆలోచన లేకుండా ఛేజింగ్‌కు మొగ్గు చూపాడు. డ్యూ ఫ్యాక్టర్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. డ్యూ పరిస్థితుల్లో ముందుగా బౌలింగ్ చేయడం మంచి ఆప్షన్ అని తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తున్నాం. డ్యూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా బౌలింగ్ చేయడం మంచి ఆప్షన్. ఇదో అద్భుతమైన మైదానం. ఇక్కడ తొలి పురుషుల మ్యాచ్ జరుగుతుంది. ఎంతో ఉత్సాహంగా ఉంది. మా కుర్రాళ్లు బాధ్యతతో ఆడటం చాలా ముఖ్యం. గత మ్యాచ్‌లో 175 మంచి స్కోర్. మా బౌలర్లు కూడా అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. హార్దిక్ పాండ్యాతో జట్టు సమతూకంగా ఉంటుంది. అతను కూల్‌గా ఆడటం, బౌలింగ్ చేయడం జట్టుకు కీలకం. మేం విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

IND vs SA Suryakumar Yadav Reveals Why India Fielded an Unchanged XI in the 2nd T20I

టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమని ఎయిడెన్ మార్క్‌రమ్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. వికెట్ చాలా బాగుంది. భారీ స్కోర్ చేసి భారత్‌పై ఒత్తిడి తేవాలనుకుంటున్నాం. ప్రతీ మ్యాచ్ ఓ గుణపాఠమే. కొన్నిసార్లు మనకు కలిసిరాదు. ఈ పిచ్ గురించి కొన్ని ఓవర్ల తర్వాత మాకు ఫీడ్‌బ్యాక్ వస్తుంది. మేం భారీ లక్ష్యాన్ని నమోదు చేయాలనుకుంటున్నాం. మా జట్టులో మూడు మార్పులు చేశాం. రీజా, లిండే, బార్ట్‌మాన్ జట్టులోకి వచ్చారు.'అని మార్క్‌రమ్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.

సౌతాఫ్రికా:

రీజా హెన్రీక్స్, క్వింటన్ డికాక్(కీపర్), ఎయిడెన్ మార్క్‌రమ్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డెనోవన్ ఫెర్రెరిరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, లుతో సిపమ్లా, లుంగి ఎంగిడి, ఒట్టెనిల్ బార్ట్‌మన్

Story first published: Thursday, December 11, 2025, 18:50 [IST]
Other articles published on Dec 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+