
గౌహతి: టీమిండియా మాజీ ఓపెనర్, దేశవాళీ దిగ్గజం వసీం జాఫర్.. సోషల్ మీడియా వేదికగా ఎంత చురుకుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను చేసే ట్వీట్లే ఈ విషయాన్ని తెలియజేస్తాయి. తనదైన సెటైరికల్ ట్వీట్లతో నవ్వులు పూయించే వసీం జాఫర్.. అదే రితీలో విమర్శకుల నోళ్లు మూయిస్తాడు. ముఖ్యంగా భారత్‌పై నోరు పారేసుకునే ఆటగాళ్లకు తనదైన శైలిలో పంచ్ ఇస్తాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌తో అతనికి సోషల్ మీడియా వేదికగా ఎప్పటికీ మాటల యుద్దం నడుస్తూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకుంటూనే ఉంటారు.
టీమ్ ఎంపిక గురించి కూడా జాఫర్ కోడింగ్ లాంగ్వేజ్‌తో టీమిండియాకు సూచనలు చేస్తుంటారు. తాజాగా భారత్ X సౌతాఫ్రికా రెండో టీ20ని ఉద్దేశించి అతను చేసిన ట్వీట్.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన భారత బ్యాటర్లను వసీం జాఫర్ తనదైన శైలిలో ప్రశంసించాడు. 'గాంధీ జయంతి రోజు ఇంత విధ్వంసమా? అది సౌతాఫ్రికాపైనా?'అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. ఈ ఫన్నీ ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ట్విటర్‌లో జాఫర్‌కు తిరుగు లేదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వారెవ్వా వాటే ట్వీట్.. అంటూ కొనియాడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. కేఎల్ రాహుల్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్), రోహిత్ శర్మ(37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43)కీలక ఇన్నింగ్స్ ఆడారు. దాంతో
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ ఒక్కడే రెండు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. పోటీపడి మరీ పరుగిలిచ్చారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లోనే టెంబా బవుమా(0), రస్సౌ(0) డకౌట్‌గా వెనుదిరిగారు.