
అత్యుత్సాహంతో..
కగిసో రబడా వేసిన 39వ ఓవర్‌లో స్టెప్ ఔటై భారీ షాట్‌కు ప్రయత్నించిన పంత్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. భారీ షాట్ ఆడే ఆతృతలో బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దాంతో పంత్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా కీపర్ చేతిలో పడింది. అయితే హాఫ్ సెంచరీలతో కీలక భాగస్వామ్యం అందించిన చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే వెనువెంటనే ఔటైన తర్వాత.. క్రీజులోకి వచ్చిన పంత్ బాధ్యతాయుతంగా ఆడాల్సింది పోయి నిర్లక్ష్యపు షాట్‌తో వికెట్ ఇచ్చుకున్నాడు.

ఏమాత్రం.. క్షమించరానిది
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. గవాస్కర్ పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'అప్పుడే క్రీజులోకి వచ్చిన హనుమ విహారీతో పాటు ఉన్న రిషభ్ పంత్ అత్యంత నిర్లక్ష్యపు షాట్ ఆడాడు. అతను ఆడిన తీరు ఏ మాత్రం క్షమించరానిది. ఇది అతని సహజ ఆటతీరు కూడా కాదు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో పంత్ కొంచెం బాధ్యతగా ఆడాల్సింది. బంతి శరీరంపైకి వస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి. రహానే, పుజారాలు పరిపక్వతతో బ్యాటింగ్ చేశారు.'గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

13 ఇన్నింగ్స్‌ల్లో విఫలం..
ఇక రిషభ్ పంత్ దారుణ వైఫల్యంపై అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం 13 ఇన్నింగ్స్‌లు ఆడిన రిషభ్ పంత్ ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ( 4, 41, 25, 37, 22, 2, 1, 9, 50, 8, 34,17,0) ఇందులో 6 ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లే ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 4 ఇన్నింగ్స్‌లు ఆడిన పంత్ 59 పరుగులు మాత్రమే చేశాడు. అయితే చతేశ్వర్ పుజారా, రహానే వైఫల్యంతో పంత్ చెత్తాటను ఎవరూ పెద్దగా గుర్తించలేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రిషభ్ పంత్‌ను సైతం పక్కనపెట్టి కేఎస్ భరత్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

సౌతాఫ్రికా లక్ష్యం 240
85/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా.. 60.1 ఓవర్లలో 266 పరుగులకు కుప్పకూలింది. దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్ 27 పరుగుల లోటు తీసేయగా సౌతాఫ్రికా ముందు 240 పరుగుల పోరాడే లక్ష్యం నమోదైంది. భారత ఇన్నింగ్స్‌లో చతేశ్వర్ పుజారా(86 బంతుల్లో 10 ఫోర్లతో 53), అజింక్యా రహానే(78 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీలతో రాణించగా.. తెలుగు క్రికెటర్ హనుమ విహారి(84 బంతుల్లో 6 ఫోర్లతో 40 నాటౌట్) అజేయంగా నిలిచాడు. చివర్లో శార్దూల్ ఠాకూర్(24 బంతుల్లో 5 ఫోర్లతో 28) విలువైన పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా, లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 47 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(31) శార్దూల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.


Click it and Unblock the Notifications












