Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌతాఫ్రికా చెత్త రికార్డ్.. 16 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా!

టెస్ట్ క్రికెట్‌లో సౌతాఫ్రికా చెత్త రికార్డ్ నమోదు చేసింది. తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. సొంతగడ్డపై భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్(6/15) బంతితో సిక్సర్ కొట్టగా.. ముఖేష్ కుమార్(2/0), జస్‌ప్రీత్ బుమ్రా(2/25) రెండేసి వికెట్లతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికారు.

టెస్ట్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సౌతాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోర్. 2018లో శ్రీలంకతో గాలే వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 73 పరుగులకే కుప్పకూలింది. 2015లో నాగ్‌పైర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 79 పరుగులకు ఆలౌటైంది. 2015లో జోహెన్నస్‌బర్గ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 83 పరుగులో కుప్పకూలింది. టెస్ట్‌ క్రికెట్‌లో సౌతాఫ్రికాకు ఇవే అత్యల్ప స్కోర్లు.

IND vs SA: South Africa registered their lowest ever total in Test cricket

16 ఏళ్ల తర్వాత ప్రతీకారం..
తొలి సెషన్‌లోనే సౌతాఫ్రికా 55 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా 16 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకుంది. 2008లో తొలి సెషన్‌లోనే టీమిండియాను 76 పరుగులకు సౌతాఫ్రికా కుప్పకూల్చింది.

టెస్ట్ క్రికెట్‌‌లో అత్యల్ప స్కోర్లు..
36 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, అడిలైడ్ 2020/21

38 ఐర్లాండ్ వర్సెస్ ఇంగ్లండ్, లార్డ్స్ 2019

43 బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్, నార్త్ సౌండ్ 2018

45 న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా, కేప్‌టౌన్ 2012/23

47 వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్, కింగ్‌స్టన్ 2003/04

47 ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా, కేప్‌టౌన్ 2011/12

సొంతగడ్డపై అత్యల్ప టెస్ట్ స్కోర్లు

47 వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్, కింగ్‌స్టన్ 2003/04

55 సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా, కేప్‌టౌన్ 2023/24

59 జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్, హరారే 2005

67 ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, లీడ్స్ 2019

Story first published: Wednesday, January 3, 2024, 18:27 [IST]
Other articles published on Jan 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+