Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: కెప్టెన్‌పై‌ వేటు.. భారత్‌తో తలపడే సౌతాఫ్రికా జట్టు ఇదే!

IND vs SA: సొంతగడ్డపై భారత్‌తో జరిగే మూడు ఫార్మాట్ల సిరీస్‌లకు క్రికెట్ సౌతాఫ్రికా జట్లను ప్రకటించింది. డిసెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల సిరీస్‌లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. ఈ వివరాలను క్రికెట్ సౌతాఫ్రికా సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో దారుణంగా విఫలమైన తమ కెప్టెన్ టెంబా బవుమాపై క్రికెట్ సౌతాఫ్రికా వేటు వేసింది. అతన్ని కేవలం టెస్ట్ సిరీస్‌కు మాత్రమే ఎంపిక చేసింది. వైట్‌బాల్ సారథ్య బాధ్యతలను ఎయిడెన్ మార్క్‌రమ్‌కు అప్పగించింది. స్టార్ పేసర్ కగిసో రబడా కూడా టెస్ట్ సిరీస్‌కే పరిమితమయ్యాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించిన క్రికెట్ సౌతాఫ్రికా.. ఐపీఎల్ స్టార్ డెవాల్డ్ బ్రేవిస్‌కు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. నాంద్రే బర్గర్ తొలి సారి సౌతాఫ్రికా టీమ్ పిలుపును అందుకున్నాడు.

IND vs SA: South Africa Announce Squads For India Series; Temba Bavuma dropped from ODI and T20I

ఫ్రీడమ్ సిరీస్‌గా నామకరణం చేసిన ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో ముందుగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. డిసెంబర్ 10 నుంచి 14 వరకు మూడు టీ20 మ్యాచ్‌లు జరగనుండగా.. డిసెంబర్ 17 నుంచి 23 వరకు వన్డే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. డిసెంబర్ 26 నుంచి జనవరి 7 వరకు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది.

సౌతాఫ్రికా టీ20 టీమ్: ఎయిడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మ్యాన్, మాథ్యూ బ్రీట్జ్కీ, నండ్రే బర్గర్, గెరాల్డ్ కొయెట్జీ, డొనొవన్ ఫెరియెరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అండీల్ ఫెహ్లుక్వాయో, తబ్రేజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్.

సౌతాఫ్రికా వన్డే టీమ్: ఎయిడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మ్యాన్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జీ, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలి పోంగ్వానా, వియాన్ ముల్దర్, అండీల్ ఫెహ్లుక్వాయో, తబ్రేజ్ షంసీ, రస్సీ వాన్ డర్ డస్సెన్, కైల్ వెర్రిన్, లిజాడ్ విలియమ్స్

సౌతాఫ్రికా టెస్ట్ టీమ్: టెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ బెండింగ్హమ్, నండ్రే బర్గర్, గెరాల్డ్ కొయెట్జీ, టోనీ డి జోర్జీ, డీన్ ఎల్గర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్‌రమ్, వియాన్ ముల్దర్, లుంగి ఎంగిడి,కీగన్ పీటర్సన్, కగిసో రబడా, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రిన్.

Story first published: Monday, December 4, 2023, 16:36 [IST]
Other articles published on Dec 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+