Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: శతక్కొట్టిన స్మృతి మంధాన!

టీమిండియా స్టార్ ఓపెనర్, మహిళా క్రికెటర్ స్మృతి మంధాన సెంచరీతో సత్తా చాటింది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో స్మృతి మంధాన 127 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్ సాయంతో 117 పరుగులు చేసింది.

ఆమె శతకానికి తోడుగా దీప్తి శర్మ(48 బంతుల్లో 3 ఫోర్లతో 37 నాటౌట్), పూజా వస్త్రాకర్(42 బంతుల్లో 3 ఫోర్లతో 31 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది.

IND vs SA Smriti Mandhana rescues India out of woods brings up her sixth ODI ton

సౌతాఫ్రికా బౌలర్లలో అయాబోంగా ఖాక(3/47) మూడు వికెట్లు తీయగా.. మసబట క్లాస్(2/51) రెండు వికెట్లు పడగొట్టాడు. అన్నేరీ డెర్క్‌సెన్, నోంకులెకో మ్లబా, షాంగేస్ తలో వికెట్ తీసారు.

భారత టాప్-5 బ్యాటర్లు షెఫాలీ వర్మ(7), దయాలన్ హేమలత(12), హర్మన్ ప్రీత్ కౌర్(10), జెమీమా రోడ్రిగ్స్(17), రిచా ఘోష్(3) దారుణంగా విఫలమవడంతో టీమిండియా 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో దీప్తి శర్మతో కలిసి స్మృతి మంధాన జట్టును ఆదుకుంది.

ఆచితూచి ఆడిన మంధాన.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలిచింది. ఈ క్రమంలో 61 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మంధాన.. అనంతరం అదే జోరును కొనసాగించింది. దీప్తి శర్మ ఔటైనా.. పూజా వస్త్రాకర్ సాయంతో 116 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది.

వన్డేల్లో స్మృతి మంధానకు ఇది 6వ సెంచరీ. ఏడో వికెట్‌కు 58 పరుగులు జోడించిన అనంతరం మంధాన క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. పూజా వస్త్రాకర్ జట్టు స్కోర్‌ను 260 పరుగుల మార్క్‌ను ధాటించింది.

Story first published: Sunday, June 16, 2024, 18:08 [IST]
Other articles published on Jun 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+