Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA:వారెవ్వా.. స్మృతి మంధాన ఫస్ట్ టైమ్ బౌలింగ్.. రెండో బంతికే వికెట్! (వీడియో)

మహిళా క్రికెట్‌‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధానా జోరు కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో వరుస సెంచరీలతో చెలరేగుతున్న ఈ క్రికెట్ బ్యూటీ.. బౌలింగ్‌లోనూ ఖాతా తెరిచింది. స్పెషలిస్ట్ బ్యాటర్ అయినస్మృతి మంధాన.. తాజాగా బౌలింగ్ చేయడం కూడా ప్రారంభించింది.

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన.. బౌలింగ్‌లో ఓ వికెట్ తీసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి బౌలింగ్ చేసినస్మృతి మంధాన తన రెండో బంతికే వికెట్ సాధించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తరహాలోనే రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ చేసినస్మృతి మంధాన సౌతాఫ్రికా బ్యాటర్ సునే లూస్‌ను ఔట్ చేసింది. మంధాన బౌలింగ్ శైలి కూడా అచ్చం విరాట్ కోహ్లీలానే ఉండటం విశేషం.

IND vs SA Smriti Mandhana bowls for the first time dismisses Sune Luus for maiden ODI scalp

ప్రస్తుతం మంధాన తీసిన వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గంటకు 110.9 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్స్మృతి మంధాన సునే లూస్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో స్మృతి మంధాన బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి అయినా.. ప్రోఫెషల్ క్రికెట్‌లో మాత్రం ఇదే తొలిసారి కాదు.

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) తొలి ఎడిషన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ అయినస్మృతి మంధాన బౌలింగ్ కూడా చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 3 బంతులు వేసి 9 పరుగులు ఇచ్చింది. దేశవాళీ క్రికెట్‌తో పాటు బిగ్ బాష్ లీగ్‌లోనూ బౌలింగ్ చేసింది. స్మృతి మంధాన బౌలింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కోహ్లీ బౌలింగ్‌తో పోల్చుతూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లోస్మృతి మంధాన(120 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్స్‌లతో 136) విధ్వంసకర శతకంతో చెలరేగింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ స్మృతి మంధాన(117) సెంచరీ నమోదు చేసింది. దాంతో మహిళా వన్డే క్రికెట్‌లో వరుసగా సెంచరీలు నమోదు చేసిన తొలి భారత మహిళా బ్యాటర్‌గా చరిత్రకెక్కింది.

IND vs SA Smriti Mandhana bowls for the first time dismisses Sune Luus for maiden ODI scalp

అంతేకాకుండా అత్యంత వేగంగా వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత మహిళా బ్యాటర్‌గా కూడా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును స్మృతి మంధాన సమం చేసింది. మిథాలీ రాజ్ 211 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 7 శతకాలు నమోదు చేయగా.. స్మృతి మంధా 84 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 325 పరుగులు చేసింది. స్మృతి మంధానకు తోడుగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 103 నాటౌట్) సెంచరీతో సత్తా చాటింది.

Story first published: Wednesday, June 19, 2024, 19:59 [IST]
Other articles published on Jun 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+