
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా..
ఈ మ్యాచ్ జరుగుతున్న ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానం ధావన్‌కు హోం గ్రౌండ్. కెరీర్ ప్రారంభం నుంచి ధావన్ ఇక్కడ ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. ఈ మైదానం డైమన్షన్స్‌తో పాటు పరిస్థితులపై అతనికి పూర్తి పట్టు ఉంది. ఈ క్రమంలోనే టాస్ గెలవగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత రెండు రోజులుగా ఇక్కడ వర్షం పడటంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు.
దాంతో మాయిశ్చర్ ఉంటుందని పసిగట్టిన ధావన్.. ఇది బౌలర్లకు అడ్వాంటేజ్ అవుతుందని భావించి చేజింగ్‌కు మొగ్గు చూపాడు. ఇక ధావన్ ఊహించినట్లుగానే పిచ్ నుంచి అడ్వాంటేజ్ లభించడంతో భారత బౌలర్లు చెలరేగారు. అయితే టాలెంటెడ్ బ్యాటర్లు అయిన సఫరీ బ్యాటర్ల బలహీనతపై దెబ్బ కొడుతూ.. ఉచ్చును బిగించారు.

ఉచ్చులో సఫారీ బ్యాటర్లు..
ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ఓ పెనర్ క్వింటన్ డికాక్, జెన్నిమలాన్‌లను ఔట్ చేసిన విధానం నభూతో న భవిష్యత్. డికాక్‌ని ఆరంభం నుంచి ఒత్తిడిలో ఉంచేందుకు ఫస్ట్ ఓవర్‌ని స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌తో భారత కెప్టెన్ శిఖర్ ధావన్ వేయించాడు. ఫస్ట్ ఓవర్‌లో మూడు బంతులు ఆడిన డికాక్ ఒక పరుగు మాత్రమే రాబట్టగాడు. దాంతో మళ్లీ మూడో ఓవర్‌లో సుందర్ చేతికి గబ్బర్ బంతినిచ్చాడు.
కానీ.. మూడో ఓవర్‌లో రెండో బంతికి డికాక్ షాట్ ఆడగా.. బ్యాట్ టాప్ ఎడ్జ్ తాకిన బంతి కీపర్ పక్క నుంచి బౌండరీకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఐదో బంతిని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా సుందర్ విసిరాడు. సాధారణంగా ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతి పడగానే డికాక్ తనని తాను నియంత్రించుకోలేడు. అది అతని పెద్ద బలహీనత.
స్పిన్నర్లు చెలరేగడంతో..
ఆ తర్వాత సిరాజ్‌తో కలిసి ధావన్ జెన్నెమన్ మలాన్‌కు స్కెచ్ వేసాడు. డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డ్ పెట్టి షార్ట్ బాల్‌తో పుల్ షాట్ ఆడేలా టెంప్ట్ చేశారు. ఈ విషయాన్ని గ్రహించని మలాన్ పుల్ షాట్ ఆడి ఉచ్చులో పడ్డాడు. ఆ తర్వాత హెండ్రీక్స్ సైతం ఇదే షాట్ బాల్ వ్యూహంతో పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాత స్పిన్నర్లు షెహ్‌బాజ్ అహ్మద్, సుందర్, కుల్దీప్ వికెట్లు తీయడంతో సఫారీ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. 94 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా నడుస్తున్నారు.


Click it and Unblock the Notifications












