For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: నా సక్సెస్ మంత్రా ఇదే: శార్దూల్ ఠాకూర్

IND vs SA: Shardul Thakur reveals his success mantra after stellar Johannesburg show
IND vs SA 2nd Test : Lord Shardul Thakur Scripts History | Oneindia Telugu

జోహన్నెస్‌బర్గ్: పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగడం, విజయం కోసమే ఆడటం, తనపై తనకు పూర్తి నమ్మకం ఉంచడమే తన సక్సెస్‌కు కారణమని టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ అన్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఏడు వికెట్లతో చెలరేగిన శార్దూల్(7/61)కెరీర్‌లో అత్యుత్తమ గణంకాలను నమోదు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో తొలి సారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. కీలక భాగస్వామ్యాలను వీడదీసి సౌతాఫ్రికా భారీ ఆధిక్యాన్ని అడ్డుకున్నాడు. ఇక మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన శార్దూల్ ఠాకూర్.. ఇంతకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చే సత్తా తనలో ఉందని పేర్కొన్నాడు.

నా సక్సెస్ మంత్రా..

నా సక్సెస్ మంత్రా..

'నేనెప్పుడూ మైదానంలోకి అడుగుపెట్టినా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో పాటు నాపై పూర్తి నమ్మకంతో ఉంటాను. మరో సంకోచం లేకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడుతుంటాను. ఇటీవల కాలంలో నా సక్సెస్‌కు కారణం ఇదే. ఇదే జోరును ముందు ముందు కూడా కొనసాగించాలనుకుంటున్నా. నేనెప్పుడూ విజయం కోసమే ఆడుతాను. టీమ్ విజయం కోసం ఆరాటపడే ఆటగాళ్లంటే తనకు ఇష్టం'అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు. బౌలింగ్‌లో సత్తాచాటినా శార్దూల్.. బ్యాటింగ్‌లో మాత్రం విఫలమయ్యాడు. సౌతాఫ్రికా పిచ్‌లు సహజంగానే పేస్‌కు అనుకూలిస్తున్నాయని తెలిపాడు.

ఇంకా మెరుగ్గా..

ఇంకా మెరుగ్గా..

'నా టెస్టు కెరీర్‌లో ఇవే అత్యుత్తమ గణాంకాలు. కానీ, ఇంత కంటే మెరుగ్గా రాణించే సత్తా ఉంది. తొలి టెస్టు జరిగిన సెంచూరియన్‌లో, రెండో టెస్టు జరుగుతోన్న జొహన్నెస్‌బర్గ్‌లోనూ పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తోంది. దీంతో సరైన లెంగ్త్‌లో బంతులేస్తూ వికెట్లు పడగొట్టాను. సీనియర్‌ బౌలర్లు బుమ్రా, మహమ్మద్‌ షమీ కూడా వికెట్ల కోసం శాయశక్తులా శ్రమించారు. ప్రస్తుతం మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ పిచ్‌పై చివరి రెండు రోజులు బ్యాటింగ్‌ చేయడం సులభం కాదు. అందుకే రెండో ఇన్నింగ్స్‌లో సఫారీల ముందు వీలైనంత భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనుకుంటున్నాం' అని శార్దూల్ చెప్పుకొచ్చాడు.

రాణిస్తున్న పుజారా, రహానే..

రాణిస్తున్న పుజారా, రహానే..

మ్యాచ్ విషయానికి వస్తే.. 85/2 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 34 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా(51 బ్యాటింగ్), అజింక్యా రహానే(54 బ్యాటింగ్) నిలకడగా ఆడుతూ.. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడిన 27 పరుగులు పోగా, ప్రస్తుతం భారత్‌కు 124 పరుగుల ఆధిక్యం ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 35/1తో ఆట మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు ఆలౌటైంది.

ఫలితంగా ఆ జట్టుకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. పీటర్సన్‌ (118 బంతుల్లో 62; 9 ఫోర్లు), తెంబా బవుమా (60 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు చేశారు. శార్దుల్‌ ఠాకూర్‌ (7/61) చిరస్మరణీయ బౌలింగ్‌ ప్రదర్శనతో చెలరేగాడు.

Story first published: Wednesday, January 5, 2022, 14:42 [IST]
Other articles published on Jan 5, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+