For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: దూసుకొచ్చిన రాకాసి బౌన్సర్.. శార్దూల్ ఠాకూర్‌కు తప్పిన ప్రమాదం! (వీడియో)

టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు ఘోర ప్రమాదం తప్పింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అతని హెల్మెట్‌కు బంతి బలంగా తాకింది. హెల్మెట్‌కు ఉన్న గ్రిల్స్ అతని తలకు తీవ్ర గాయం కాకుండా రక్షణగా నిలిచాయి. గెరాల్డ్ కోయిట్జీ వేసిన భారత తొలి ఇన్నింగ్స్ 44 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ మూడో బంతిని గంటకు 148 కిలోమీటర్ల వేగంతో కోయిట్జీ బౌన్సర్‌గా సంధించగా.. శార్దూల్ ఠాకూర్ పుల్‌షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో అతను విఫలమయ్యాడు. దాంతో అడ్వాన్స్‌గా షాట్ ఆడగా.. బంతి హెల్మెంట్ గ్రిల్స్‌ను బలంగా తాకింది. గిల్స్.. పైన ఉన్న భాగంలో తాకడంతో అతని ఎడమ వైపు నొసలు భాగంలో వాపు వచ్చింది.

IND vs SA: Shardul Thakur hit on helmet, swelling on forehead

ఈ ఊహించని ఘటనతో శార్దూల్ ఠాకూర్ కళ్లు బైర్లు కమ్మాయి. రూల్స్ ప్రకారం టీమిండియా ఫిజియో వచ్చి శార్దూల్ ఠాకూర్‌కు కంకషన్ టెస్ట్ చేసాడు. ఈ ఘటన తర్వాత శార్దూల్ అసౌకర్యంగా బ్యాటింగ్ చేశాడు. చివరకు రబడా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో ఏడో వికెట్‌కు నమోదైన 43 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. హెల్మెట్ గ్రిల్స్ లేకుంటే శార్దూల్ ఠాకూర్ పరిస్థితి దారుణంగా ఉండేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్ ఫిలిప్ హ్యూస్ ఇదే తరహా బౌన్సర్‌తో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఐసీసీ బ్యాటర్ల సెఫ్టీ విషయంలో పలు నిబంధనలు తీసుకొచ్చింది.

బ్యాటర్ తల బాగంలో బంతి తాకినా.. హెల్మెట్‌‌ను హిట్ చేసినా ఫిజియోలు వచ్చి కంకషన్ టెస్ట్ చేసేలా రూల్ తీసుకొచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా రెండో సెషన్ పూర్తయ్యే సమయానికి 50 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(39 బ్యాటింగ్)తో పాటు జస్‌ప్రీత్ బుమ్రా(0 బ్యాటింగ్) ఉన్నారు. విరాట్ కోహ్లీ(38), శ్రేయస్ అయ్యర్(31), శార్దూల్ ఠాకూర్(24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా(5/41) ఐదు వికెట్లతో చెలరేగగా.. నండ్రె బర్గర్(2/39) రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Tuesday, December 26, 2023, 19:25 [IST]
Other articles published on Dec 26, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+