IND vs SA: ఏడేసిన శార్దూల్ ఠాకూర్.. ఆధిక్యంలో సౌతాఫ్రికా!

జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్(7/61) ఏడు వికెట్లతో కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. దాంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. సఫారీ జట్టులో కీగన్ పీటర్సన్(118 బంతుల్లో 9 ఫోర్లతో 62) టెంబా బవుమా(60 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. డీన్ ఎల్గర్(120 బంతుల్లో 4 ఫోర్లతో 28), కైల్ వెరీన్(72 బంతుల్లో 2 ఫోర్లతో 21), మార్కో జాన్సెన్(34 బంతుల్లో 3 ఫోర్లతో 21), కేశవ్ మహరాజ్(29 బంతుల్లో 3 ఫోర్లతో 21) విలువైన పరుగులతో కీలక భాగస్వామ్యాల్లో పాలుపంచుకున్నారు. భారత బౌలర్లలో శార్దూల్‌కు అండగా మహమ్మద్ షమీ(2/52) రెండు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(1/49) ఓ వికెట్ పడగొట్టాడు.

పీటర్సన్ హాఫ్ సెంచరీ..
35/1 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. ఓవర్ నైట్ బ్యాట్స్‌మన్ పీటర్సన్(118 బంతుల్లో 9 ఫోర్లతో 62), డీన్ ఎల్గర్(120 బంతుల్లో 4 ఫోర్లతో 28) భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వారి సహనానికి పరీక్షగా నిలిచారు. పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమైన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. ఓవైపు ఎల్గర్ నిదానంగా ఆడినా.. మరోవైపు పీటర్సన్ తనదైన శైలిలో ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీని విడదీయడంలో భారత స్టార్ పేసర్లు మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా విఫలమయ్యారు. కెప్టెన్ రాహుల్.. మహ్మద్ సిరాజ్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్‌ను రంగంలోకి దింపినా ఫలితం లేకపోయింది.

చెలరేగిన లార్డ్ శార్దూల్..
ఇక లంచ్ బ్రేక్‌కు ముందు శార్దూల్‌కు బంతినివ్వడంతో అతను సత్తా చాటాడు. కెప్టెన్ డీన్ ఎల్గర్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చి టీమిండియాకు మంచి బ్రేక్ త్రూ అందించాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కొద్దిసేపటికే పీటర్సన్‌ను ఔట్ చేసిన శార్దూల్.. లంచ్ బ్రేక్‌కు ముందు డస్సెన్(1) కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 12 పరుగుల వ్యవధిలోనే సఫారీ టీమ్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇక సౌతాఫ్రికా 102/4 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

బవుమా హాఫ్ సెంచరీ..
శార్దూల్ మూడు కీలక వికెట్లు తీయడంతో సౌతాఫ్రికా పతనం మొదలైనట్లేనని అంతా భావించారు. కానీ టెంబా బవుమా ఆ అవకాశాన్ని భారత బౌలర్లకు ఇవ్వలేదు. కైల్ వెరీన్‌తో కలిసి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఓవైపు కైల్ వెరీన్ డిఫెన్స్‌కు పరిమితమైనా మరోవైపు టెంబా బవుమా వేగంగా పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే 6 బౌండరీలతో పాటు ఓ సిక్సర్ కూడా బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని శార్దూలే విడదీసాడు. కైల్ వెరీన్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక తన మరుసటి ఓవర్‌లోనే హాఫ్ సెంచరీ హీరో టెంబా బవుమాను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చి శార్దూల్ కెరీర్‌లో తొలిసారి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. రబడాను షమీ ఔట్ చేయడంతో సౌతాఫ్రికా 191/7 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది.

మళ్లీ శార్దూలే..
ఇక టీ బ్రేక్ అనంతరం టెయిలండర్లను ఔట్ చేయడానికి కూడా భారత బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. కేశవ్ మహరాజ్, మార్కో జాన్సెన్ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. బుమ్రా, షమీ బౌలింగ్‌లో ఎదురొడ్డి నిలిచారు. ఈ క్రమంలో బంతులను తమ శరీరానికి తాకించుకున్నారు. ఇక కేశవ్ మహారాజ్‌ను బుమ్రా బౌల్డ్ చేయగా.. జాన్సెన్ పోరాడాడు. ఈ క్రమంలో భారత స్కోర్‌ను అధిగమించి ఆధిక్యాన్ని అందించాడు. ఇక జాన్సెన్ జోరుకు బ్రేక్ వేసిన శార్దూల్.. లుంగి ఎంగిడిని కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చి సఫారీ ఇన్నింగ్స్ ఎండ్ కార్డ్ వేసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications