Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. 22 ఏళ్ల తర్వాత డబుల్ సెంచరీ!

టీమిండియా మహిళా ఓపెనర్ షెఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా డబుల్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డుకెక్కింది. సౌతాఫ్రికాతో చెన్నై వేదికగా శుక్రవారం మొదలైన ఏకైక టెస్ట్‌లో షెఫాలీ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో డబుల్ సెంచరీ సాధించింది.

197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్స్‌లతో 205 పరుగులు చేసి పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. వన్డే తరహా బ్యాటింగ్‌తో 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ నమోదు చేసిన షెఫాలీ వర్మ.. ఆస్ట్రేలియా బ్యాటర్ అన్నబెల్ సదర్లాండ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డ్‌ను అధిగమించింది.

IND vs SA Shafali Verma creates history after smashes fastest women s Test double century

ఈ ఏడాది ప్రారంభంలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సదర్లాండ్ 248 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించింది. ఇప్పటి వరకు ఇదే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీగా కొనసాగగా.. షెఫాలీ వర్మ ఆ రికార్డును తిరగరాసింది.

రెండు దశాబ్దాల తర్వాత..
అంతేకాకుండా భారత్ తరఫున డబుల్ సెంచరీ నమోదు చేసిన రెండో మహిళా బ్యాటర్‌గా కూడా షెఫాల్మీ వర్మ రికార్డు నమోదు చేసింది. అప్పుడెప్పుడో షెఫాలీ వర్మ పుట్టకముందు 22 ఏళ్ల క్రితం టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్.. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 407 బంతుల్లో 214 పరుగులతో డబుల్ సెంచరీ సాధించింది. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత 20 ఏళ్ల షెఫాలీ వర్మ భారత్ తరఫున మరో డబుల్ సెంచరీ నమోదు చేసింది.

సెహ్వాగ్ శైలిలో డబుల్ సెంచరీ..
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో షెఫాలీ వర్మ డబుల్ సెంచరీ పూర్తి చేయడం విశేషం. డెల్మీ టక్కర్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాది డబుల్ సెంచరీ మార్క్ అందుకుంది. ఆమెను సౌతాఫ్రికా బౌలర్లు ఔట్ చేయలేకపోయారు. కానీ జెమీమా రోడ్రిగ్స్‌తో సమన్వయ లోపం కారణంగా షెఫాలీ వర్మ రనౌట్‌గా వెనుదిరిగింది. దాంతో 205 పరుగుల భారీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

భారత్ స్కోర్ 525/4..
షెఫాలీ వర్మ డబుల్‌ సెంచరీకి తోడుగా స్మృతి మంధాన(161 బంతుల్లో 27 ఫోర్లు, సిక్స్‌తో 149) శతక్కొట్టడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 98 ఓవర్లలో 4 వికెట్లకు 525 పరుగులు చేసింది. దాంతో తొలి రోజే 500 పరుగులు చేసిన జట్టుగా భారత్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. క్రీజులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(42 బ్యాటింగ్), రిచా ఘోష్(43 బ్యాటింగ్) ఉన్నారు.

తొలి వికెట్‌కు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన(149) 292 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

Story first published: Friday, June 28, 2024, 17:32 [IST]
Other articles published on Jun 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+