Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: ముత్తుసామి శతకం.. సౌతాఫ్రికా భారీ స్కోర్!

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్ చేసింది. సెనరన్ ముత్తుసామి(206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109) శతకంతో చెలరేగగా.. మార్కో జాన్సెన్(91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/115) నాలుగు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/75), మహమ్మద్ సిరాజ్(2/106), రవీంద్ర జడేజా(2/94) రెండేసి వికెట్లు పడగొట్టారు.

247/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికాకు ముత్తుసామి అసాధారణ బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కైల్ వెర్రెన్(122 బంతుల్లో 5 ఫోర్లతో 45)‌తో కలిసి ఏడో వికెట్‌కు 88 పరుగులు జోడించిన ముత్తుసామి.. జాన్సెన్‌తో కలిసి 8వ వికెట్‌కు 97 పరుగులు జోడించాడు. సిమన్ హర్మర్(5) విఫలమైనా.. కేశవ్ మహరాజ్ సైతంతో కలిసి మార్కో జాన్సెన్ భారీ స్కోర్ అందించాడు.

IND vs SA Senuran Muthusamy Marco Jansen Star India Trail SA By 480 Runs At Stumps

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. భారత బౌలర్ల వైఫల్యం సౌతాఫ్రికాకు కలిసొచ్చింది. భారత బౌలర్ల వైఫల్యంతో ఈ మ్యాచ్‌ భారత్ చేజారింది. ఒకవేళ భారత బ్యాటర్లు మెరుగ్గా రాణించినా.. మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది.

Story first published: Sunday, November 23, 2025, 16:34 [IST]
Other articles published on Nov 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+