Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: ‘డియర్ సెలెక్టర్స్.. ఇది నా కండ బలం’- సంజూ శాంసన్ సెంచరీ సెలెబ్రేషన్స్! (వీడియో)

టీమిండియా వెటరన్ బ్యాటర్ సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగాడు. సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియా పిలుపును అందుకున్న సంజూ శాంసన్.. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో 114 బంతుల్లో 108 పరుగులు చేసి వన్డేల్లో తొలి శతకాన్ని అందుకున్నాడు.

సెంచరీ మార్క్ అందుకున్న అనంతరం సంజూ శాంసన్ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. తన బైసెప్స్‌ను డగౌట్‌ వైపు చూపించాడు. 'ఇదే నా అసలు సిసలు బలం' అంటూ సైగలు చేశాడు. సంజూ శాంసన్‌ సంబరాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. భారత సెలెక్టర్లను ఉద్దేశించే సంజూ శాంసన్ ఇలా సంబరాలు చేసుకున్నాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

IND vs SA: Sanju Samsons biceps celebration after hitting maiden ODI hundred goes viral

'డియర్ సెలెక్టర్స్.. ఇది నా కండ బలం'అని సంజూ శాంసన్ చెప్పినట్లు ఉందని కామెంట్ చేస్తున్నారు. సంజూ శాంసన్‌కు సరైన అవకాశాలు రాలేదు. ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే సంజూ సెంచరీ చేయడంతో ఫ్యాన్స్ ఇలా రియాక్ట్ అవుతున్నారు. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ జట్టును ఆదుకున్నాడు.

101 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడగా.. తిలక్ వర్మ సాయంతో నాలుగో వికెట్‌కు 116 పరుగులు జోడించాడు. 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ శాంసన్.. 110 బంతుల్లో సెంచరీ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌తో పాటు తిలక్ వర్మ(77 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. సంజూ శాంసన్(114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108) సెంచరీతో కదం తొక్కగా.. తిలక్ వర్మ(77 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు.

చివర్లో రింకూ సింగ్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో బ్యూరన్ హెండ్రిక్స్(3/63) మూడు వికెట్లు తీయగా.. నండ్రె బర్గర్ రెండు వికెట్లు పడగొట్టాడు. లిజా విలియమ్స్, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, December 21, 2023, 21:24 [IST]
Other articles published on Dec 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+