Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: డకౌట్లలో సంజూ శాంసన్ రికార్డ్‌..!

టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. టీ20ల్లో వరుసగా రెండు శతకాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన సంజూ.. అంతలోనే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో సంజూ శాంసన్ సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు.

మార్కో జాన్సెన్ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో పరుగులేమి చేయకుండానే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ డకౌట్‌తో సంజూ శాంసన్ చెత్త రికార్డ్‌ను మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు డకౌటైన తొలి బ్యాటర్‌గా సంజూ శాంసన్ నిలిచాడు.

IND vs SA Sanju Samson becomes First player in cricket history with unique T20I Record

ఈ ఏడాది ఇప్పటి వరకు సంజూ శాంసన్.. ఐదు సార్లు డకౌటయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌటైన సంజూ.. ఆ తర్వాత జూలైలో శ్రీలంకపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. తాజాగా సౌతాఫ్రికాతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. దాంతో ఒకే ఏడాదిలో అత్యధిక సార్లు డకౌటైన తొలి బ్యాటర్‌గా సంజూ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.

ఓవరాల్‌గా టీ20ల్లో ఇప్పటి వరకు సంజూ శాంసన్ 6 సార్లు డకౌటయ్యాడు. దాంతో టీ20ల్లో అత్యధిక సార్లు డకౌటైన భారత బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 12 డకౌట్లతో రోహిత్ శర్మ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. 7 డకౌట్స్‌తో విరాట్ కోహ్లీ సంజూ శాంసన్ కంటే ముందున్నాడు. సంజూ వరుస సెంచరీలు చేయడంపై అతని తండ్రి శాంసన్ విశ్వనాథ్, చిన్ననాటి కోచ్‌లు సంతోషం వ్యక్తం చేశారు.

సరైన అవకాశాలు ఇవ్వకుండా భారత కెప్టెన్లు ధోనీ, కోహ్లీ, రోహిత్‌తో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. సంజూ 10 ఏళ్ల కెరీర్‌ను నాశనం చేశారని ఆరోపించారు. ఇంతలోనే సంజూ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటై తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే సంజూ శాంసన్ వికెట్ కోల్పోయిన నిలకడగా ఆడుతోంది. యువ ప్లేయర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో వేగంగా పరుగులు చేస్తున్నారు.

Story first published: Wednesday, November 13, 2024, 21:25 [IST]
Other articles published on Nov 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+