Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీతోనే మార్క్‌రమ్ సెంచరీ.. మాజీ క్రికెటర్ ఫైర్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ విఫలమయ్యాడని విమర్శించాడు. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్.. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడని తెలిపాడు. అతని అనాలోచిత బౌలింగ్ మార్పులు సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్‌కు కలిసొచ్చిందని, శతకం పూర్తి చేసుకునే అవకాశం దక్కిందని అభిప్రాయపడ్డాడు.

IND vs SA Rohit Sharma పై Commentator విమర్శలు Winning Captain పై కక్ష | Capetown | Telugu Oneindia

ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సంజయ్ మంజ్రేకర్.. రోహిత్ శర్మ బౌలింగ్ మార్పులను తప్పుబట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించిన మహమ్మద్ సిరాజ్‌కు ఎక్కువ బౌలింగ్ ఇవ్వకపోవడం టీమిండియాకు నష్టం చేసిందన్నాడు. సిరాజ్‌కు ముందే బౌలింగ్ ఇచ్చి ఉంటే మార్క్‌రమ్ ఎప్పుడో ఔటయ్యేవాడని అభిప్రాయపడ్డాడు.

IND vs SA: Sanjay Manjrekar slams Rohit Sharmas captaincy following Aiden Markrams hundred on Day 2

'రెండో రోజు ఆటలో సిరాజ్ రెండో ఓవర్ వేసే సమయానికే జరగాల్సింది జరిగిపోయింది. మార్క్‌రమ్ శతకం పూర్తి చేసుకోవడంతో పాటు ఆధిక్యం 60 పరుగులు ధాటింది. ముఖేశ్ కుమార్, ప్రసిధ్ కృష్ణకు బౌలింగ్‌ ఇచ్చి రోహిత్ మూల్యం చెల్లించుకున్నాడు. సిరాజ్‌తో కాకుండా ముఖేష్ కుమార్‌తో బౌలింగ్ చేయించడం ఘోర తప్పిదం. బుమ్రా బౌలింగ్ చేస్తున్నప్పుడు మరో ఎండ్‌లో సిరాజ్ బౌలింగ్ చేసి ఉంటే సౌతాఫ్రికా బ్యాటర్లు ఇబ్బంది పడేవారు.'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

బుమ్రా బౌలింగ్‌లో మార్క్‌రమ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో 19 పరుగులు పిండుకొని శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. చివరకు మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లోనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

62/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌతాఫ్రికా 36.5 ఓవర్లలో 176 పరుగులకు కుప్పకూలింది. జస్‌ప్రీత్ బుమ్రా(6/61) ఆరు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. ఎయిడెన్ మార్క్‌రమ్(103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 106) సెంచరీతో చెలరేగగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

భారత బౌలర్లలో బుమ్రాకు తోడుగా ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీసారు. 98 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా మార్క్‌రమ్ సెంచరీతో 78 పరుగులు మాత్రమే అదనంగా చేసింది. దాంతో టీమిండియా ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. స్వల్ప లక్ష్య చేధనకు దిగిన భారత్ నిలకడగా ఆడుతూ విజయం దిశగా సాగుతోంది.

Story first published: Thursday, January 4, 2024, 16:32 [IST]
Other articles published on Jan 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+