Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే బుమ్రా, చాహల్‌ను పక్కనపెట్టాం: రోహిత్ శర్మ

Rohit Sharma says Jasprit Bumrah

తిరువనంతపురం: సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గ్రీన్ ఫీల్డ్ మైదానం వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఊహించనట్లుగానే భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వర్క్‌లోడ్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్‌లకు ఈ సిరీస్‌ నుంచి సెలెక్టర్లు విశ్రాంతి కల్పించిన విషయం తెలిసిందే. దాంతో ఈ ఇద్దరి స్థానాల్లో రిషభ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్‌ తుది జట్టులోకి వచ్చారు. ఆశ్చర్యకరంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్‌‌లకు తుది జట్టులో అవకాశం దక్కలేదు. వారి స్థానాల్లో దీపక్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్ అవకాశం అందుకున్నారు.

అయితే ఈ మార్పులకు గల కారణాన్ని రోహిత్ శర్మ టాస్ సందర్భంగా తెలియజేశాడు. జస్‌ప్రీత్ బుమ్రా చివరి నిమిషయంలో జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడని చెప్పాడు. ఈ ఉదయం బుమ్రాకు వెన్ను నొప్పి తిరగబెట్టిందని, అందుకే అతన్ని ఈ మ్యాచ్‌కు దూరంగా పెట్టామని హిట్ మ్యాన్ తెలిపాడు. ఇక చాహల్‌కు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించామన్నాడు. పిచ్ బ్యాటింగ్‌‌కు అనుకూలంగా ఉందనే చేజింగ్‌కు మొగ్గు చూపానని పేర్కొన్నాడు.

వికెట్‌పై గ్రాస్ ఉన్న నేపథ్యంలో పేసర్లకు అనుకూలించే అవకాశం ఉందన్నాడు. ఇక టీ20ల్లో విజయాల జోరును కొనసాగించడం చాలా కష్టమని, జట్టులో మంచి వాతావరణం నెలకొందని చెప్పాడు. మిషన్ మెల్‌బోర్న్‌లో భాగంగా అన్ని విషయాల్లో మెరుగవుతామని, వరుస విజయాలు సాధిస్తామనే నమ్మకం ఉందన్నాడు.

మరోవైపు బీసీసీఐ కూడా బుమ్రా ఆడకపోవడానికి గల కారణాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది. బుధవారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న బుమ్రా వెన్ను నొప్పి తిరగబెట్టిందని ఫిజియోలకు ఫిర్యాదు చేశాడని, అతన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తుందని, ఈ కారణంతోనే తొలి టీ20 ఆడటం లేదని ట్వీట్ చేసింది.

ఇక బవుమా సైతం టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకునేవాడినని తెలిపాడు. గత కొన్ని నెలలుగా తమ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చిందని చెప్పిన బవుమా.. అదే జోరును ఈ సిరీస్‌లో కూడా కొనసాగిస్తామని తెలిపాడు. తమ ఆటగాళ్లు భారత ట్రిప్‌ను ఎప్పుడూ ఎంజాయ్ చేస్తారని, మరోసారి ఇక్కడి పరిస్థితులను ఆస్వాదిస్తామని చెప్పాడు. ఆస్ట్రేలియాకు విభిన్నమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుందన్నాడు.

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్(కెప్టెన్), టెంబా బవుమా, రిలీ రస్సో, ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జ్, టబ్రైజ్ షంసీ

Story first published: Wednesday, September 28, 2022, 20:13 [IST]
Other articles published on Sep 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+