Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: రోహిత్ శర్మ.. మాకు ఎందుకు ఈ కర్మ?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగుతోంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు.

కగిసో రబడా వేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే హిట్ మ్యాన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రబడా వేసిన అద్భుతమైన బంతికి రోహిత్ శర్మ మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది. ఈ అసాధారణ బంతికి హిట్ మ్యాన్ నోరెళ్ల బెట్టాడు.

 IND vs SA: Rohit Sharma brutally trolled after getting duck out in 1st Test vs South Africa

ఆ వెంటనే బర్గర్ మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌(5)ను బౌన్సర్‌తో బోల్తా కొట్టించాడు. బర్గర్ వేసిన షాట్ బాల్‌ను ఫ్లిక్ చేయబోయిన యశస్వి కీపర్‌కు చిక్కాడు. దాంతో టీమిండియా 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. దాంతో ఈ మ్యాచ్‌పై సౌతాఫ్రికా పట్టు బిగించింది. క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్(17 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ(0 బ్యాటింగ్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఓపెనర్ల వైఫల్యంపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మపై మండిపడుతున్నారు. 'రోహిత్ శర్మ.. మాకు ఎందుకు ఈ కర్మ'అని ప్రశ్నిస్తున్నారు. రోహిత్ శర్మ కెరీర్‌ ముగింపు పలికి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ‌లో సత్తువ పోయిందని, అతన్ని పక్కనపెట్టడం ఉత్తమమని సూచిస్తున్నారు. రోహిత్ శర్మ వైఫల్యం కారణంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ స్వేచ్చగా ఆడలేకపోతున్నారని మండిపడుతున్నారు.

మరికొందరు మాత్రం రోహిత్ శర్మకు అండగా నిలుస్తున్నారు. రెండో టెస్ట్‌లో రోహిత్ చెలరేగుతాడని, తన ఆటతోనే విమర్శకుల నోళ్లు మూయిస్తాడని ఆకాంక్షిస్తున్నారు.

256/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 108.4 ఓవర్లలో 408 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డీన్ ఎల్గర్(287 బంతుల్లో 28 ఫోర్లతో 185) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా.. టెయిలెండర్ మార్కో జాన్సెన్(147 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 84 నాటౌట్) శతకాన్ని అందుకోలేకపోయాడు. భారత బౌలర్లలో బుమ్రాకు తోడుగా సిరాజ్ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసారు.

ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు కుప్పకూలింది. కేఎల్ రాహుల్(101) శతకంతో చెలరేగగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

Story first published: Thursday, December 28, 2023, 18:35 [IST]
Other articles published on Dec 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+