దినేశ్ కార్తీక్ తొలి టీ20 ఆడినప్పుడు రిషభ్ పంత్ చెడ్డీలు ఏసుకుంటున్నాడు! ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్!

న్యూఢిల్లీ: భారత్ తమ తొలి టీ20 మ్యాచ్‌ను 2006లో ఆడింది. సౌతాఫ్రికాతో గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్ భారత్‌కు 160వది. నాటి తొలి మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఆడిన దినేశ్ కార్తీక్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత కూడా అతను మళ్లీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం విశేషం. జూన్ 1న 37వ పుట్టిన రోజు జరుపుకున్న కార్తీక్ ఒక్కడే అప్పటి బ్యాచ్ నుంచి ఇంకా రిటైర్ కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.

కార్తీక్ ఒక్కడే..
మొట్టమొదటి మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్‌తో పాటు ఆడిన ప్లేయర్లు అందరూ ఇప్పటికే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఎమ్మెస్ ధోనీ వంటి ఒకరిద్దరు మినహా ఎవ్వరూ ఫ్రాంఛైజీ క్రికెట్ కూడా ఆడడం లేదు. వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి కెప్టెన్ల కెప్టెన్సీ ఆడిన దినేశ్ కార్తీక్, తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రిషభ్ పంత్ కెప్టెన్సీలో కూడా ఓ మ్యాచ్ ఆడాడు.

చెడ్డీలు ఏసుకుంటున్నాడు..
దాంతో ఫ్యాన్స్ దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సమయంలో రిషభ్ పంత్ వయసెంతో తెలుసా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కార్తీక్ తొలి మ్యాచ్ ఆడినప్పుడు పంత్.. చెడ్డీలు వేసుకుంటున్నాడని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కార్తీక్ తొలి టీ20 ఆడినప్పుడు పంత్ వయసు ఏడు ఏళ్లని, రెండో క్లాస్‌లో కూర్చొని... బీ ఫర్ బ్యాట్ అంటూ పాఠాలు చదువుతున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు.
అంతేకాకుండా 2016లో ఇషాన్ కిషన్ సారథ్యంలో రిషభ్ పంత్ అండర్ 19 ప్రపంచకప్ ఆడితే.. 6 ఏళ్ల తర్వాత పంత్ సారథ్యంలో ఇషాన్ ఆడుతున్నాడని గుర్తు చేస్తున్నారు. పంత్ సారథ్యం వహించిన తొలి మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి ఎదురైంది.


సౌతాఫ్రికాదే విజయం..
మొదట భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 76; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా... హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ రిషభ్ పంత్ (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
అనంతరం దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. వాన్‌డెర్ డసెన్ (46 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' డేవిడ్ మిల్లర్ (31 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) నాలుగో వికెట్‌కు 64 బంతుల్లోనే 131 పరుగులు జోడించి సిరీస్‌లో సఫారీకి శుభారంభం అందించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications