న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ.. దూకుడుగా ఆడటంలో తగ్గేదేలే!

IND vs SA: Rishabh Pant hits fifty, India 130/4 At Lunch

కేప్‌టౌన్: నిలకడలేమి ఫామ్, నిర్లక్ష్యపు షాట్స్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ కీలక మ్యాచ్‌లో దుమ్మురేపాడు. తనదైన శైలిలోనే దూకుడుగా ఆడుతూ విమర్శకులకు తన బ్యాట్‌తోనే బదులిచ్చాడు. టెస్ట్ అయినా.. వన్డే అయినా దూకుడుగా ఆడటంలో తగ్గేదేలే అంటూ చెలరేగాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో పంత్ హాఫ్ సెంచరీతో మెరిసాడు. వన్డే తరహా బ్యాటింగ్‌తో దూకుడుగా ఆడుతూ 55 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మూడో రోజు ఆట ప్రారంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును.. రిషభ్ పంత్, కెప్టెన్ విరాట్ కోహ్లీ((127 బంతుల్లో 4 ఫోర్లతో 28 బ్యాటింగ్) కలిసి ఆదుకున్నాడు. షార్ట్ పిచ్ బాల్స్‌తో సౌతాఫ్రికా బౌలర్లు బెంబేలెత్తించినా.. తనదైన షాట్లతో బదులిచ్చాడు. సెకండ్ టెస్ట్‌లో నిర్లక్ష్యపు షాట్‌తో ఔటై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పంత్.. తాజా ఇన్నింగ్స్‌లోనూ ఆ తరహా షాట్స్ ఆడాడు. స్టెప్ ఔట్ అవుతూ బంతిని బౌండరీకి తరలించాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో క్రీజు ధాటి అతను కొట్టిన సిక్స్ అందర్నీ ఉక్కిరి బిక్కిరి చేసింది.

రిస్కీ షాట్స్ ఆడవద్దని సీనియర్లు చెబుతున్నా.. తన బ్యాటింగ్ శైలిని మార్చేదేలేదని హాఫ్ సెంచరీతో బదులిచ్చాడు. ఈ క్రమంలోనే జాన్సెన్ బౌలింగ్‌లో క్విక్ డబుల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 43 ఓవర్లలో 4 వికెట్లకు 130 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది.

అంతకుముందు 57/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. జాన్సెన్ వేసిన ఫస్ట్ ఓవర్ రెండో బంతికే పుజారా లెగ్ స్లిప్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. కీగన్ పీటర్సన్ వన్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్‌కు అతను ఔటవ్వాల్సి వచ్చింది. ఇక రబడా వేసిన ఆ మరుసటి ఓవర్‌లో అజింక్యా రహానే(1) క్యాచ్ ఔటయ్యాడు. అనూహ్య బౌన్స్‌ను అంచనా వేయలేక పెవిలియన్ బాట పట్టాడు.

Story first published: Thursday, January 13, 2022, 17:01 [IST]
Other articles published on Jan 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X